‘ఆయుష్మాన్‌ భారత్‌’ ప్రీమియం ఎంతంటే..? | Sakshi
Sakshi News home page

‘ఆయుష్మాన్‌ భారత్‌’ ప్రీమియం రూ.1,000

Published Wed, Feb 21 2018 11:32 AM

Premium on Ayushman Bharat to be Rs 900-1000: NITI - Sakshi

న్యూఢిల్లీ: రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో కేంద్రం ప్రతిష్టాత్మకంగా తీసుకురాబోతున్న జాతీయ ఆరోగ్య పరిరక్షణ పథకం (ఎన్‌హెచ్‌పీఎస్‌) కింద బీమా కోసం ఒక్కో కుటుంబానికి ప్రీమియం రూ.900 నుంచి రూ.1,000 వరకు ఉండొచ్చని నీతి ఆయోగ్‌ తెలిపింది. ఈ మొత్తాన్ని కేంద్రం, రాష్ట్రాలు 6:4 నిష్పత్తిలో భరిస్తాయి. 10 కోట్ల పేద కుటుంబాలకు రూ.5 లక్షల విలువైన ఆరోగ్య బీమాను ఉచితంగా అందజేస్తామని కేంద్రం ఇటీవల తన బడ్జెట్‌లో పేర్కొనడం తెలిసిందే. దీనిపై మంగళవారం నిర్వహించిన సమావేశానికి త్రిపుర మినహా (ఎన్నికలు జరుగుతుండటంతో) అన్ని రాష్ట్రాల ప్రతినిధులు హాజరయ్యారని నీతి ఆయోగ్‌ అధికారి తెలిపారు.

ఆయుష్మాన్‌ భారత్ కార్యక్రమంలో భాగంగా జాతీయ ఆరోగ్య పరిరక్షణ పథకం అమలు చేయనున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ పార్లమెంట్‌లో బడ్జెట్‌ ప్రవేశపెట్టినట్టప్పుడు ప్రకటించారు. దీని కోసం రూ. 12 వేల కోట్లు కేటాయిస్తున్నట్టు తెలిపారు. ఈ పథకాన్ని ‘మోదీ కేర్‌’గా సమాచార మాధ్యమాలు పేర్కొంటున్నాయి.

Advertisement
Advertisement