మాదకద్రవ్యాల వ్యసనంపై ప్రధాని మోదీ ఆందోళన | Sakshi
Sakshi News home page

మాదకద్రవ్యాల వ్యసనంపై ప్రధాని మోదీ ఆందోళన

Published Sun, Dec 14 2014 11:38 AM

మాదకద్రవ్యాల వ్యసనంపై ప్రధాని మోదీ ఆందోళన - Sakshi

న్యూఢిల్లీ: యువతపై మాదకద్రవ్యాల ప్రభావం ఆందోళన కలిగిస్తోందని  ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. 'మన్ కీ బాత్'  ఆకాశవాణి కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. యువతరం మంచిదే కానీ, మాదకద్రవ్యాలు మంచివి కావని చెప్పారు. మాదకద్రవ్యాల వ్యసనం యువతను అంధకారంలోకి నెట్టివేస్తుందని హెచ్చరించారు.  యువత అభివృద్ధిని ధ్వంసం చేస్తుందని,  యువత ఆరోగ్యాన్ని నాశనం చేస్తుందని ఆందోళన వ్యక్తొం చేశారు. రు. ఈ వ్యసనం కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తుందన్నారు. దురలవాట్లు అకస్మాత్గా రావు, వెంటనే దూరం కావు, తల్లిదండ్రులు పిల్లల అలవాట్లను గమనిస్తూ ఉండాలని సూచించారు. తల్లిదండ్రులు పిల్లలకు ఎక్కువ సమయం కేటాయించాలన్నారు. వారి అభిప్రాయాలను స్వేచ్ఛగా చెప్పనివ్వాలని అన్నారు.

మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రతిఒక్కరూ సహకరించాలని కోరారు. ఈ వ్యసనాన్ని మానసిక రుగ్మతగా పరిగణించాలన్నారు. ఈ సమస్యను తీవ్రంగా పరిగణిస్తున్నామని చెప్పారు. మాదకద్రవ్యాల నిర్మూలనకు టోల్ప్రీ నెంబరు ఏర్పాటు చేస్తామని చెప్పారు.
**

Advertisement
Advertisement