చైనా మూకలను ఎప్పుడు ఖాళీ చేయిస్తారు: రాహుల్‌ గాంధీ | Sakshi
Sakshi News home page

చైనా మూకలను ఎప్పుడు ఖాళీ చేయిస్తారు: రాహుల్‌ గాంధీ

Published Tue, Jun 30 2020 8:47 PM

Rahul Gandhi Asked Modi When He Will Evict Chinese Troops From Ladakh - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: చైనా మూకలను లడక్‌ నుంచి ఎప్పుడు తరిమేస్తారో చెప్పాలని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ప్రధాన మంత్రి నరేంద్రమోదీని ప్రశ్నించారు. చైనా భారత భూభాగాన్ని ఆక్రమించిందని దేశం మొత్తానికి  తెలుసు. లడక్‌లో నాలుగు స్థావరాలలో చైనా ట్రూప్స్‌ ఉన్నాయి. మీరు దేశ  ప్రజలకు చెప్పండి ఎప్పుడు, ఎలా చైనా మూకలను  తరిమివేస్తారో? అని రాహుల్‌ గాంధీ వీడియో ద్వారా మోదీని ప్రశ్నించారు. (‘చైనా సరిహద్దు వివాదంపై చర్చకు సిద్ధం’)

గత వారం చైనా చర్యలను పబ్లిక్‌గా ఖండించాలని  కాంగ్రెస్‌ పార్టీ  డిమాండ్‌ చేసింది. దీనిపై మోదీ ఏవిధంగాను స్పందించలేదు.  జూన్‌ 15న లడక్‌లోని గల్వాన్‌ లోయలో చైనా- భారత్‌ సరిహద్దు వివాదంలో 20 మంది భారత సైనికులు అమరులు కావడంతో దేశమంతట  ఆందోళనలు చెలరేగిన విషయం తెలిసిందే. మంగళవారం ఇరు దేశాల సీనియర్‌  మిలటరీ కమాండర్స్‌ మధ్య సరిహద్దు వివాదానికి సంబంధించి చర్చలు జరిగాయి. ఇండియా సార్వభౌమత్వానికి, భద్రతకి, రక్షణకి ప్రమాదకరంగా ఉన్నాయంటూ 59 చైనా యాప్స్‌ను  సోమవారం కేంద్ర ప్రభుత్వం నిషేధించిన  విషయం తెలిసిందే. (‘మోదీ మౌనంగా ఉంటూ కరోనాకు లొంగిపోయారు’)


 

Advertisement
Advertisement