ఉచితంగా ఉల్లిపాయలు.. | Sakshi
Sakshi News home page

ఉచితంగా ఉల్లిపాయలు..

Published Thu, Aug 25 2016 6:59 PM

ఉచితంగా ఉల్లిపాయలు.. - Sakshi

భోపాల్: నిన్న మొన్నటివరకూ కన్నీళ్లు తెప్పించిన ఉల్లిపాయలను...ఇప్పుడు ఎలా వదిలించుకోవాలా అని మధ్యప్రదేశ్ ప్రభుత్వం యోచిస్తోంది. దీంతో ఉల్లిగడ్డలను ఉచితంగా పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ ఏడాది మేలో ఉల్లి ధరలు గణనీయంగా పడిపోయాయి. దీంతో రైతులకు భరోసా కల్పించేందుకు  ప్రభుత్వం వారివద్ద నుంచి  కేజీ ఆరు రూపాయలకు 10.4 లక్షల క్వింటాళ్ల  ఉల్లిని కొనుగోలు చేసింది. అయితే కొనుగోలు చేసిన ఉల్లిని నిల్వ చేసేందుకు రాష్ట్రంలో సరైన గిడ్డండి సదుపాయం లేకపోవడం ఇప్పుడు సర్కార్కు తలనొప్పి వ్యవహారంగా మారింది.

నిల్వ సదుపాయం లేకపోవడంతో వర్షాకాలంలో అవి కుళ్లిపోవడం మొదలెట్టాయి. దీంతో కొనుగోలు చేసిన ఉల్లిని వదిలించుకోవడానికి ప్రభుత్వం తక్కువ ధరకు రేషన్ దుకాణాల ద్వారా విక్రయించాలని నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా ఉచితంగా కూడా ఇచ్చేసేందుకు ముందుకు వచ్చింది. అయితే రవాణా ఖర్చుల నిమత్తం కేజీ ఉల్లిపాయలకు కేవలం ఒక్క రూపాయిని వసూలు చేయనుంది. సో మీకు ఉల్లిపాయలు కేజీ రూపాయికి కానీ, లేదా ఫ్రీగా  కావాలనుకుంటే మధ్యప్రదేశ్ వెళ్లి తెచ్చుకోవచ్చు.

మరోవైపు మహారాష్ట్రలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఆ రాష్ట్రంలో కూడా ఉల్లి ధరలు దారుణంగా పడిపోయాయి. కేజీ ఉల్లిపాయలు అయిదు పైసలు  పలుకుతుండటంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement