రాజ్‌‌నాథ్‌ సింగ్‌ లద్దాఖ్‌‌ పర్యటన | Sakshi
Sakshi News home page

రాజ్‌నాథ్‌ సింగ్‌ లద్దాఖ్‌‌ పర్యటన

Published Wed, Jul 1 2020 7:43 PM

Rajnath Singh Visit Leh On Friday To Review Security Situation In Ladakh - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: భారత్‌-చైనా సరిహద్దు వివాదం ఉద్రిక్తత నేపథ్యంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ శుక్రవారం లద్దాఖ్‌‌లోని లేహ్‌ ప్రాంతాన్ని పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భారత ఆర్మీ చీఫ్‌ మనోజ్ ముకుంద్ నారావనే పాల్గొంటారు. పర్యటనలో భాగంగా మంత్రి సీనియర్‌ సైనిక అధికారులతో భేటీ కానున్నారు. అదే విధంగా వివాదస్పద ప్రాంతంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో రాజ్‌నాథ్‌సింగ్‌ తెలుసుకోనున్నారు. ఇక భారత్‌- చైనా మధ్య ఉన్న వాస్తవాధీన రేఖ వెంబడి భద్రతాపరమైన పరిస్థితులపై ఆయన ఉన్నత స్థాయిలో సమీక్షించడం కోసం తూర్పు లద్దాఖ్‌‌‌ సందర్శిస్తున్నట్లు తెలుస్తోంది. (మరిన్ని భేటీలు అవసరం)

చైనా తన ఆర్మీకి చెందిన రెండు విభాగాలను వాస్తవాధీన రేఖ వెంబడి మోహరించినట్లు భారత ఇంటెలిజెన్స్ విభాగం సమాచారం అందించిన నేపథ్యంలో ఈ పర్యటన ఖరారు కావటంపై ఆసక్తి నెలకొంది. ఇక సరిహద్దు వివాదం పరిష్కారం దిశగా భారత్‌, చైనాల మధ్య మంగళవారం జరిగిన సైనికాధికారుల మూడో విడత సమావేశం అసంపూర్తిగా ముగిసిందని, వివాదం సమసిపోయేందుకు మరిన్ని భేటీలు అవసరమని ప్రభుత్వ వర్గాలు వెల్లడించిన విషయం తెలిసిందే. (‘భారత్‌ చర్యలను చైనా ఊహించలేదు’)

Advertisement

తప్పక చదవండి

Advertisement