మాతో పంచుకోండి | Sakshi
Sakshi News home page

మాతో పంచుకోండి

Published Sat, Jan 14 2017 2:15 AM

మాతో పంచుకోండి

ఆర్మీ చీఫ్‌ బిపిన్‌ రావత్‌ సూచన
న్యూఢిల్లీ: వృత్తిగత సమస్యలనుఆర్మీ, ఇతర భద్రతా విభాగాల సిబ్బంది ఫేస్‌బుక్‌ వంటి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడంపై ఆర్మీ చీఫ్‌ బిపిన్‌ రావత్‌ స్పందించారు. ఫిర్యాదు చేసేందుకు సైనికులు సోషల్‌ మీడియాను కాకుండా త్వరలో ఏర్పాటు చేయనున్న ఫిర్యాదుల పెట్టెల్ని ఉపయోగించుకోవాలన్నారు. ఫిర్యాదుల్ని అంతర్గత వ్యవస్థల ద్వారానే పరిష్కరించుకోవాలన్నారు. ఎవరికైనా ఏదైనా ఫిర్యాదు ఉంటే తనతో ప్రత్యక్షంగా పంచుకోవచ్చన్నారు. సీనియర్లు ఫిర్యాదుల్ని పరిష్కరిస్తారనే నమ్మకం సైనిక దళాల్లో ఉండాలన్నారు.

‘మనమంతా ఒక బృందం... భారతదేశం భద్రంగా, శాంతియుతంగా ఉండేందుకు ఒక దళంగా పనిచేయాలి’ అని రావత్‌ పిలుపునిచ్చారు. అన్ని ఆర్మీ కమాండ్‌ ప్రధాన కేంద్రాలతో పాటు దిగువ స్థాయి ప్రాంతాల్లోనూ ఫిర్యాదు పెట్టెల్ని ఏర్పాటు చేస్తామన్నారు. ఫిర్యాదులు, సలహాల పెట్టెల ఏర్పాటుకు ఆదేశాలిచ్చానని తెలిపారు. సామాజిక మాధ్యమం రెండు వైపులా పదునున్న ఆయుధమని దాన్ని అనుకూలంగా, ప్రతికూలంగానూ ఉపయోగించుకోవచ్చం టూ సున్నితంగా హెచ్చరించారు.

బాధ్యతలూ పంచుకోవాలి!
పురుషులతో సమానంగా అవకాశాలిచ్చినప్పుడు అంతే స్థాయిలో మహిళలు బాధ్యతలు పంచుకోవాల్సి ఉంటుందని రావత్‌ స్పష్టం చేశారు. యుద్ధ భూమిలోకి వెళ్లాలనుకొనే మ హిళా జవాన్లకు ప్రత్యేక వసతుల కల్పన ఉండదన్నారు. కనుక ఈ బృందంలో ఉండాలా వద్దా అనేది వారే నిర్ణయించుకోవాలన్నారు.

శాంతి వద్దంటే సర్జికల్‌ దాడే!
భారత్‌లో శాంతికి విఘాతం కలిగిస్తే.. పాక్‌పై మరిన్ని సర్జికల్‌ దాడులు తప్పకపోవచ్చన్నారు. భవిష్యత్తులోనూ భారత్‌కు ప్రచ్ఛన్నయుద్ధం, ఉగ్రవాదం వంటి సవాళ్లు తప్పవన్నారు. నవంబర్‌ 23న ఇరు దేశాల డీజీఎంవోలు చర్చించిన తర్వాత నియంత్రణ రేఖ వద్ద గతంలో కంటే పరిస్థితులు కాస్త మెరుగుపడ్డాయన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement