Sakshi News home page

కేరళలో అత్యాచారాల గురించి తెలిస్తే అవాక్కే..

Published Sun, Feb 26 2017 6:03 PM

కేరళలో అత్యాచారాల గురించి తెలిస్తే అవాక్కే.. - Sakshi

తిరువనంతపురం: తాజాగా విడుదలైన గణాంకాల్లో కేరళలో జరుగుతున్న నేరాల తీవ్రతను తెలియజేస్తున్నాయి. ఒక్క 2016లోనే ఆ రాష్ట్రంలో మహిళలు, చిన్నారులపై దాదాపు 16,960 నేరాలు చోటు చేసుకున్నాయి. వీటిల్లో అత్యాచారాలను విడిగా పేర్కొంటూ దాదాపు 2,568. ఒక్క ఏడాదిలోనే ఇన్ని సంఘటనలు చోటుచేసుకోవడంపై అక్కడి అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

తాజాగా సినీ నటిపై లైంగిక వేధింపులు చోటు చేసుకోవడంతో కేరళలో ఇప్పటి వరకు గత ఏడాదిలో అసలు ఎన్ని నేరాలు చోటు చేసుకున్నాయనే జాబితా తీయగా ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. 2016లో చోటు చేసుకున్న ఒక్క లైంగిక దాడుల గణాంకాలు పరిశీలిస్తే మహిళలపై 1,644 ఘటనలు జరగగా చిన్నారులపై 924 ఘటనలు జరిగాయి. ఇవి 2015లో మహిళలపై 1,263, పిల్లలపై 720 చోటు చేసుకున్నాయి. సాధారణంగా ఏ ఏడాదికాయేడు ఇలాంటివి తగ్గుముఖం పట్టాల్సి ఉండగా మరింత పెరుగుతుండటంపై అధికారులు విస్తుపోతున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement