రూ.251 స్మార్ట్‌ఫోన్ డబ్బులు వెనక్కి.. | Sakshi
Sakshi News home page

రూ.251 స్మార్ట్‌ఫోన్ డబ్బులు వెనక్కి..

Published Tue, Mar 1 2016 9:02 PM

రూ.251 స్మార్ట్‌ఫోన్ డబ్బులు వెనక్కి..

న్యూఢిల్లీ: చౌక స్మార్ట్‌ఫోన్ (రూ.251) ఫ్రీడమ్‌పై వివాదాల నేపథ్యంలో.. ముందస్తుగా బుక్ చేసుకున్న వారికి డబ్బును వాపసు చేస్తానని ప్రకటించిన తయారీ సంస్థ మంగళవారం నుంచి ఆ పనిని మొదలుపెట్టింది. సదరు ఫోన్ తయారీ సంస్థ రింగింగ్ బెల్స్.. తన వెబ్ సైట్ ద్వారా చెల్లింపులు చేస్తోంది. రూ.251 స్మార్ట్ ఫోన్ కోసం ముందుగా డబ్బులు చెల్లించి  బుక్ చేసుకున్న 30,000 మందికి నగదు తిరిగి ఇచ్చేస్తామన్న తయారీ కంపెనీ ఇప్పటివరకు 14,800 మంది కస్టమర్లకు రూ.84 లక్షలను వెనక్కి ఇచ్చేసినట్లు అవెన్యూ ఇండియా సీఈవో విశాల్ పటేల్ 'ఎకనామిక్స్ టైమ్స్'కు తెలిపారు.

కాగా రూ.251కే స్మార్ట్ ఫోన్ అంటూ భారీ ప్రచారం చేసిన రింగింగ్ బెల్స్ వ్యవహారంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ దృష్టి సారించింది. కంపెనీ, దాని ప్రమోటర్ల లావాదేవీలు, బ్యాంకు ఖాతాలను ఈడీ పరిశీలిస్తోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే ఇప్పటివరకు ఎవ్వరికీ నోటీసుల్లాంటివేవీ జారీకాలేదు. ఆదాయ పన్ను విభాగం కూడా కంపెనీ వ్యవహారాలను పరిశీలిస్తుండటం తెలిసిందే.

Advertisement

తప్పక చదవండి

Advertisement