రూ. 55 కోట్ల కరెంటు బిల్లు! | Sakshi
Sakshi News home page

రూ. 55 కోట్ల కరెంటు బిల్లు!

Published Sun, May 31 2015 11:19 AM

రూ. 55 కోట్ల కరెంటు బిల్లు! - Sakshi

రాంచీ:ఇప్పటివరకూ మనం వందలు, వేలు, లక్షల్లో మాత్రమే కరెంటు బిల్లులు చూసుంటాం. ఏకంగా కోట్లలో కరెంటు బిల్లు వస్తే.. అది ఇంటి ఓనర్ ను ఎంతటి షాక్ కు గురి చేస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇలా ఇంటి యజమాని నివ్వెరపోయెలా చేసిన కరెంట్ బిల్లు ఉదంతం రాంచీలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రాంచీలో ఉంటున్న కృష్ణా ప్రసాద్ అనే వ్యక్తి గత కొన్ని రోజుల క్రితం ఓ వివాహ వేడుకకు వెళ్లాడు. అనంతరం తిరిగి వచ్చిన అతను కరెంటు బిల్లు చూసి కంగుతిన్నాడు. ఆ నెలసరి కరెంట్ బిల్లు ఎంతో తెలుసా?, అక్షరాలా రూ.55 కోట్ల, 49 లక్షల, 88 వేల 36 రూపాయిలు. దీనిపై కృష్ణ ప్రసాద్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు.

ఈ బిల్లును చూసి తన 55 సంవత్సరాల తల్లి మరణపు అంచుల వరకూ వెళ్లొచ్చిందని ప్రసాద్ తెలిపాడు. ఈ తప్పుడు బిల్లుపై తాను కోర్టుకు వెళతానని స్సష్టం చేశాడు. కేవలం ఐదుగురు సభ్యులు మాత్రమే ఉంటున్న రెండు గదుల ఇంటికి ఇంతటి బిల్లు రావడంపై తీవ్ర ఆందోళన చెందినట్లు ప్రసాద్ తెలిపాడు. తన ఇంటిలో కనీసం ఎయిర్ కండీషనర్ ను కూడా ఉపయోగించకపోయినా కోట్లలో బిల్లు రావడమేమటని ప్రశ్నిస్తున్నాడు. ఇదిలా ఉండగా ఈ ఘటనపై జార్ఖండ్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్ మెంట్ ఇద్దరు ఉద్యోగులను సస్పెండ్ చేసింది. ఇది కేవలం సాంకేతిక తప్పిదేమనని అంగీకరించింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement