‘మోదీజీ..మీపై ఆరెస్సెస్ ప్రభావం’ | Sakshi
Sakshi News home page

‘మోదీజీ..మీపై ఆరెస్సెస్ ప్రభావం’

Published Fri, Feb 26 2016 2:27 AM

RSS effect on the PM Modi

న్యూఢిల్లీ: ప్రధానిపై ఆరెస్సెస్ ప్రభావం చాలా ఉందని లోక్‌సభలో ప్రతిపక్ష కాంగ్రెస్ నేత  ఖర్గే విమర్శించారు. ‘మీపై ఆరెస్సెస్ ప్రభావం తీవ్రంగా ఉంది. పేదల గురించి ఏనాడూ ఆలోచించని ఆరెస్సెస్ ప్రభావం ప్రధానిపై ఉండటం మంచిది కాదు’ అని హితవు పలికారు. ‘మీ చుట్టూ ఇలాంటివారుంటే మీ ప్రభుత్వ పథకాలను ఎలా ముందుకు తీసుకువెళ్లగలర’ని ప్రశ్నించారు.

రాష్ట్రపతి ప్రసంగంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. మహిళలు, దళితులు, పేదలు, కార్మికులు, ఆదివాసీల ప్రస్తుత పరిస్థితులకు ఆ ప్రసంగంలో స్థానం లేకపోయిందన్నారు.  ప్రపంచం మెచ్చిన ఆహార భద్రత చట్టాన్ని బీజేపీ పాలిత గుజరాత్‌లో అమలు చేయకపోవడాన్ని ఖర్గే ప్రశ్నించారు. ‘అమెరికా అధ్యక్షుడు ఒబామాతో మోదీ రెగ్యులర్‌గా ఫోన్లో మాట్లాడుతూనే ఉంటారు. అయినా, పాక్‌కు అమెరికా ఎఫ్ 16 యుద్ధ విమానాలను అమ్ముతుంది’ అని కేంద్రానికి చురకలు వేశారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement