ఆ రికార్డు ఈరోజు బద్దలైంది: సచిన్‌

3 May, 2019 21:02 IST|Sakshi

ముంబై: ఉత్తరప్రదేశ్‌కు చెందిన ‘బార్బర్‌ షాప్‌ గాల్స్‌’ జ్యోతికుమారి, నేహలను కలుసుకోవడాన్ని గౌరవంగా భావిస్తున్నానని క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ అన్నారు. కుటుంబాన్ని పోషించేందుకు అబ్బాయిల్లా మారి సెలూన్‌ నడిపిస్తున్న వీరికి జిల్లెట్‌ స్కాలర్‌షిప్‌ను సచిన్‌ అందజేశారు. అంతేకాదు వారితో స్వయంగా షేవింగ్‌ చేయించుకుని మురిసిపోయారు. ఈ ఫోటోలను ట్విటర్‌లో షేర్‌ చేశారు. (చదవండి: నాన్నకు వారసులు)

‘ఎవరి ముందు షేవింగ్‌ చేయించుకోవడానికి నేను ఇష్టపడను. కానీ ఈరోజు రికార్డు చెరిగిపోయింది. జ్యోతికుమారి, నేహలను కలుసుకోవడాన్ని గౌరవంగా భావిస్తున్నాను. వీరికి జిల్లెట్‌ స్కాలర్‌షిప్‌ అందజేశాన’ని సచిన్‌ ట్వీట్‌ చేశారు. గోరఖ్‌పూర్‌ నగరానికి సమీపంలోని భన్వారీతోలి గ్రామానికి చెందిన జ్యోతి, నేహ జీవన పోరాటం గురించి మీడియాలో ప్రముఖంగా రావడంతో జిల్లెట్‌ సంస్థ వీరిని ఆదుకునేందుకు వచ్చింది. వీరిద్దరిపై లఘు చిత్రాన్ని కూడా రూపొందించింది.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు