‘క్రమశిక్షణ చర్యలతో తొలగిస్తే అంతే’ | Sakshi
Sakshi News home page

‘క్రమశిక్షణ చర్యలతో తొలగిస్తే అంతే’

Published Thu, Dec 5 2013 6:34 AM

Sacked employee can't seek re-employment after acquittal: Supreme Court

న్యూఢిల్లీ: క్రమశిక్షణ చర్యల కింద తొలగింపునకు గురైన ఉద్యోగి.. అదే విధమైన అభియోగాల కింద కోర్టు నిర్దోషిగా విడుదల చేసినా తనను తిరిగి ఉద్యోగంలోకి తీసుకోవాలని కోరలేడని సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. క్రిమినల్ కోర్టు, విచారణాధికారి ముందు ఒకేవిధమైన అభియోగాలు ఉన్నా.. కోర్టు విడుదల చేసినందున తిరిగి ఉద్యోగంలోకి తీసుకోవాలనే నిబంధనేదీ లేదని జస్టిస్ కె.ఎస్.రాధాకృష్ణ, జస్టిస్ ఎ.కె.సిక్రితో కూడిన సుప్రీం బెంచ్ పేర్కొంది. పశ్చిమబెంగాల్‌కు చెందిన పోలీసు కానిస్టేబుల్ శంకర్ ఘోష్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు బుధవారం విచారించింది.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement