కార్తీ మీరు ఆ రూ.20కోట్లు విత్‌డ్రా చేసుకోవచ్చు!

17 Jan, 2020 18:30 IST|Sakshi

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత పి.చిదంబరం కొడుకు కార్తీ చిదంబరం అత్యున్న‌త న్యాయ‌స్థానం వ‌ద్ద డిపాజిట్ చేసిన రూ.20 కోట్లను విత్‌డ్రా చేసుకునేందుకు సుప్రీంకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. విదేశాలకు వెళ్లడానికి అనుమతి కోసం గతంలో రూ.20 కోట్ల డిపాజిట్‌ తీసుకొని సుప్రీంకోర్టు అంగీకారం తెలిపిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ డిపాజిట్‌ను విత్‌డ్రా చేసుకోవడానికి సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. అందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని జస్టిస్‌ ఎస్ఏ బోబ్డే నేతృత్వంలోని ధ‌ర్మాస‌నం స్ప‌ష్టం చేసింది. గత సంవత్సరం మే, జూన్‌ నెలల మధ్యలో విదేశాలకు వెళ్లేందుకు సుప్రీంకోర్టును అనుమతి కోరగా.. సుప్రీం ఆదేశాల ప్రకారం ఆ సొమ్మును డిపాజిట్‌ చేశారు. కాగా.. ఐఎన్ఎక్స్ మీడియా, ఎయిర్ సెల్ మ్యాక్సిస్ మ‌నీల్యాండ‌రింగ్ కేసుల్లో కార్తీ చిదంబ‌రం ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న విష‌యం తెలిసిందే.

చదవండి: కార్తీ మరో రూ. 10 కోట్లు కట్టి వెళ్లండి..

మరిన్ని వార్తలు