'సీమాంధ్ర నేతలు సమర్థంగా వాదనలు విన్పించారు' | Sakshi
Sakshi News home page

'సీమాంధ్ర నేతలు సమర్థంగా వాదనలు విన్పించారు'

Published Thu, Aug 15 2013 9:41 PM

'సీమాంధ్ర నేతలు సమర్థంగా వాదనలు విన్పించారు' - Sakshi

న్యూఢిల్లీ: ఆంటోని కమిటితో  సీమాంధ్రుల సమావేశం ముగిసింది.  ఆంటోని కమిటీతో మంత్రులు కాంగ్రెస్ వార్ రూమ్‌లో సమావేశమైయ్యారు. భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల సలహాదారు దిగ్విజయ్ సింగ్.. విభజన తర్వాత ఉత్పన్నమైయ్యే సమస్యలను మంత్రులు వినిపించారన్నారు. 

మంత్రి తోట నరసింహం భార్య వాణి దీక్షను విరమించాల్సిందిగా దిగ్విజయ్ విజ్ఞప్తి చేశారు.  ఈ నెల 19, 20 తేదీల్లో ఆంటోని కమిటీ తిరిగి సమావేశమవుతుందని ఆయన తెలిపారు. విభజన తర్వాతే వచ్చే పరిస్థితులపై సీమాంధ్ర ఎంపీలు తమ వాదనను బలంగా వినిపించారన్నారు. వారు చెప్పిన విషయాలను కమిటీ నమోదు చేసుకుందని దిగ్విజయ్ తెలిపారు.
 
విభజన వల్ల ఉత్పన్నమయ్యే సమస్యలను వివరించామని మంత్రి పల్లంరాజు తెలిపారు. ఈ సమావేశంలో రైతులు, కార్మికులు, ఉద్యోగులు, విద్యార్థుల సమస్యలపై చర్చించామన్నారు. సీమాంధ్రలో వాస్తవ పరిస్థితులను ఆంటోనికి కమిటీకి వివరించామని, దిగ్విజయ్ సింగ్ త్వరలో హైదరాబాద్‌కు వస్తానని చెప్పారని పల్లంరాజు తెలిపారు. అందరికీ సమన్యాయం చేసేందుకు కృషి చేయాలని కోరినట్లు చిరంజీవి  తెలిపారు
 

Advertisement
Advertisement