భారత జట్టు డైరెక్టర్గా సౌరవ్ గంగూలీ? | Sakshi
Sakshi News home page

భారత జట్టు డైరెక్టర్గా సౌరవ్ గంగూలీ?

Published Mon, May 18 2015 4:42 PM

భారత జట్టు డైరెక్టర్గా సౌరవ్ గంగూలీ?

భారత జట్టుతో పాటూ సహాయ సిబ్బందిలోనూ మార్పులు చేయాలని బిసిసిఐ భావిస్తోంది. భారత జట్టు డైరెక్టర్గా ఉన్న రవిశాస్త్రి బదులు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ వైపు బిసిసిఐ చీఫ్ జగన్మోహన్ దాల్మియా మొగ్గు చూపుతున్నారు. సుదీర్ఘంగా టీమిండియాకు కెప్టెన్ గా సేవలందించిన గంగూలీ జట్టును ఉన్నతస్థాయిలో నిలపాడనడంలో ఎటువంటి సందేహాం లేదు. గత గంగూలీ రికార్డులను పరిగణలోకి తీసుకోన్న బీసీసీఐ ఆ మేరకు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా సచిన్ టెండుల్కర్, రాహుల్ ద్రవిడ్లకు కూడా బిసిసిఐలో మంచి పదవులు అప్పజెప్పే అవకాశం ఉంది.


రిటైర్మెంట్ అంచున్ ఉన్న వీరేంద్ర సెహ్వాగ్, హర్భజన్ సింగ్, జహీర్ ఖాన్లను తిరిగి జట్టులోకి తీసుకోనున్నట్లు సమాచారం.

 

Advertisement
Advertisement