‘నీట్‌’ లో జీరో.. అయినా ఎంబీబీఎస్‌ సీటు..! | Sakshi
Sakshi News home page

‘నీట్‌’ లో జీరో.. అయినా ఎంబీబీఎస్‌ సీటు..!

Published Mon, Jul 16 2018 8:59 PM

Students  Scored Zero Marks In NEET Paper Got MBBS Seats - Sakshi

న్యూఢిల్లీ : నేషనల్ ఎలిజబులిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్)లో సున్నా, నెగెటీవ్‌ మార్కులు వచ్చినా దాదాపు 400 మందికి ఎంబీబీఎస్‌ సీట్లు రావడం ఆందరిని ఆశ్చర్యానికి గురుచేస్తోంది. ఫిజిక్స్‌, కెమిస్ట్రీ లాంటి సబ్జెక్టుల్లో జిరో మార్కులు వచ్చినా ఎంబీబీఎస్‌ కాలేజిల్లో అడ్మిషన్‌ లభించడం గమనార్హం. 

నీట్‌లో పాస్ అయిన 1990 మందికి 2017లో వైద్య కళాశాల్లలో అడ్మిషన్ లభించింది. వీరిలో 530 మందికి ఫిజిక్స్, కెమెస్ట్రీ, రెండింటిలో కలిపి సింగిల్ డిజిట్, సున్న, నెగిటివ్ మార్కులు మాత్రమే వచ్చాయి. వీరిలో 507 మంది ప్రైవేటు మెడికల్ కళాశాల్లలో అడ్మిషన్ పొందారు.
 
ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ తదితర సబ్జెక్టులకు నీట్‌లో ప్రత్యేకంగా కటాఫ్ లేదు. ఒక్కో పేపర్‌లో కనీసం ఇన్ని మార్కులు రావాలన్న నిబంధన కూడా లేదు. దీంతో చాలా మందికి జీరో మార్కులు వచ్చినా కూడా సీటు లభించింది. గతంతో ప్రతి సబ్జెక్టుల్లో 50 శాతం మార్కులు రావాలనే నిబంధన ఉండేది. కానీ ఫిబ్రవరి 2012లో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) ఈ నిబంధనలను మారుస్తూ మొత్తం 50 శాతం వస్తే సరిపోతుందని నోటిఫికేషన్ జారీ చేసింది.

ప్రస్తుతం నీట్‌ను సీబీఎస్‌ఈ నిర్వహిస్తోంది. ఇకపై  వైద్య విద్య ప్రవేశ పరీక్ష(నీట్‌), జేఈఈ(మెయిన్స్‌), జాతీయ అర్హత పరీక్ష(నెట్‌) లాంటి పరీక్షలను ఇకపై సీబీఎస్‌ఈకి బదులుగా, కొత్తగా ఏర్పాటైన నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌టీఏ) నిర్వహిస్తుందని హెచ్చార్డీ మంత్రి ప్రకాశ్‌ జవడేకర్‌ వెల్లడించారు. నీట్‌ను ఫిబ్రవరి, మే నెలల్లో జేఈఈ–మెయిన్స్‌ను జనవరి, ఏప్రిల్‌ నెలల్లో నిర్వహిస్తారు.
 

Advertisement
Advertisement