‘స్వలింగ సంపర్కం’పై స్వామి ఏమన్నారంటే.. | Sakshi
Sakshi News home page

‘స్వలింగ సంపర్కం’పై స్వామి ఏమన్నారంటే..

Published Tue, Jan 9 2018 10:12 PM

Subramanian Swamy comments on LGBT - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: స్వలింగ సంపర్కులతోపాటు, స్త్రీ, పురుషుల మధ్య అసహజ శృంగారానికి అడ్డుకట్ట వేస్తున్న భారతీయ శిక్షా స్మతిలోని 377వ సెక్షన్‌ను సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు పునర్‌ పరిశీలించేందుకు  అంగీకరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ సీనియర్‌ నేత సుబ్రమణ్య స్వామి స్వలింగ సంపర్కం (మగ-మగ, ఆడ-ఆడ మధ్య శృంగారం), ఎల్జీబీటీల అంశంపై స్పందించారు. ఎల్జీబీటీ కమ్యూనిటీకి చెందినవారు ఏం చేసినా వ్యక్తిగత విషయంగా ఉండాలని, కానీ పబ్లిక్‌ లో ఆ విషయాన్ని బహిరంగంగా వెల్లడించడంలాంటివి చేస్తే శిక్షించాల్సిందేనని అభిప్రాయపడ్డారు.

జన్యు పరమైన లోపాల కారణంగానే స్వలింగ సంపర్కులుగా తయారవుతారని చెప్పారు. తమ జెండర్‌ (హోమో సెక్స్‌వల్‌)​ పలానా అని, తాము పలానా కమ్యూనిటీ(ఎల్జీబీటీ) వ్యక్తులతో శృంగారంలో పాల్గొంటామని బహిర్గతం చేయడం చేస్తే చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రపంచంలో సగానికి పైగా దేశాలు స్వలింగ సంపర్క వివాహాలను వ్యతిరేకిస్తున్నారని స్వామి గుర్తుచేశారు. మనుషులు సాధారణంగా హమో సెక్స్‌వల్స్‌గా మారడం లేదని, జన్యుపరమైన లోపాలు అందుకు ప్రధాన కారణంగా కనిపిస్తోందని బీజేపీ సీనియర్‌ నేత పేర్కొన్నారు.

Advertisement
Advertisement