పెట్రోల్ కల్తీని నివారించండి: సుప్రీంకోర్టు | Sakshi
Sakshi News home page

పెట్రోల్ కల్తీని నివారించండి: సుప్రీంకోర్టు

Published Fri, Aug 26 2016 2:16 PM

పెట్రోల్ కల్తీని నివారించండి: సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ: పట్టణాలు, గ్రామాలు అనే తేడా లేకుండా పెట్రోల్ బంకుల్లో భారీగా కల్తీ జరుగుతోందని సుప్రీంకోర్టు పేర్కొంది. పెబ్రోల్ బంకుల్లో జరుగుతున్న కల్తీని అరికట్టేందుకు చర్యలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వానికి ఆదేశించింది. ఎటువంటి చర్యలు చేపట్టారో ఆరు వారాల్లోగా తెలపాలని సూచించింది. చమురు కల్తీకి ఆస్కారం లేని పెట్రోల్, డీజిల్ అమ్మకపు యంత్రాలు తయారు చేసే అంశాన్ని పరిశీలించాలని కోరింది.

పెట్రోల్లో కిరోసిన్ కలుపుతున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉత్తరప్రదేశ్ కు చెందిన సదాబాద్ ఎమ్మెల్యే దేవేంద్ర అగర్వాల్ పై విచారణకు సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement