మాస్కులు, శానిటైజర్ల ధరలపై హెల్ప్‌లైన్‌

4 Apr, 2020 00:42 IST|Sakshi

సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్రం

న్యూఢిల్లీ: మాస్కులు, శానిటైజర్ల ధరల నియంత్రణకు జారీ చేసిన నోటిఫికేషన్‌ తు.చ. తప్పకుండా అమలయ్యేలా హెల్ప్‌లైన్‌ నంబర్లను అందుబాటులోకి తెచ్చి, వాటిపై ప్రచారం కల్పిస్తామని కేంద్రం తెలిపింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో దేశంలో మాస్కులు, శానిటైజర్ల ధరలను దుకాణదారులు భారీగా పెంచడంపై ‘జస్టిస్‌ ఫర్‌ రైట్స్‌ ఫౌండేషన్‌’అనే ఎన్జీవో వేసిన పిటిషన్‌పై జస్టిస్‌ ఎల్‌.నాగేశ్వరరావు, జస్టిస్‌ దీపక్‌ గుప్తాల ధర్మాసనం శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారణ చేపట్టింది. శానిటైజర్లు, లిక్విడ్‌ సోప్, మాస్కుల ధరల నియంత్రణకు జారీ చేసిన ఆదేశాలు అమలుకాని సందర్భాల్లో ప్రజలు యంత్రాంగాన్ని అప్రమత్తం చేసేందుకు హెల్ప్‌లైన్‌ నంబర్లను ఏర్పాటు చేయనున్నట్లు ఈ సందర్భంగా కేంద్రం తెలిపింది.(9 గంటలకు.. 9 నిమిషాల పాటు)

అదేవిధంగా, పౌరులందరికీ కోవిడ్‌ పరీక్షలు ఉచితంగా జరిపించాలంటూ దాఖలైన పిల్, వలస కార్మికులకు కేంద్రమే వేతనం చెల్లించాలంటూ దాఖలైన పిటిషన్‌పై ధర్మాసనం కేంద్రం వివరణ కోరింది. రిసార్టులు, హోటళ్లను షెల్టర్లుగా మార్చి, వలస కార్మికులు సొంతూళ్లకు వెళ్లకుండా ఆశ్రయం కల్పించాలంటూ దాఖలైన మరో పిటిషన్‌ను ధర్మాసనం తోసిపుచ్చింది. కాగా, కోవిడ్‌ మహమ్మారిని కట్టడి చేసే వరకు ‘పిల్‌లు వేయడమే పనిగా పెట్టుకున్న వారి’పై లాక్‌డౌన్‌ విధించాలని కేంద్రం వ్యాఖ్యానించింది. యావత్‌ అధికార యంత్రాంగం తమ శక్తియుక్తులను కరోనాపై పోరుకు ధారపోస్తున్న ఈ కష్ట సమయంలో, ఏసీ గదుల్లో కూర్చున్న కొందరు వేసే పిల్‌ల కారణంగా అధికారులు విలువైన సమయాన్ని వృథా చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేసింది. (మందు తాగడం జీవన విధానం: బీజేపీ నేత )

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు