ఫస్ట్ క్లాస్ ప్లేయరా, ఫస్ట్ క్లాస్ క్రికెటరా? | Sakshi
Sakshi News home page

ఫస్ట్ క్లాస్ ప్లేయరా, ఫస్ట్ క్లాస్ క్రికెటరా?

Published Thu, Oct 6 2016 5:38 PM

ఫస్ట్ క్లాస్ ప్లేయరా, ఫస్ట్ క్లాస్ క్రికెటరా? - Sakshi

న్యూఢిల్లీ: న్యాయవ్యవస్థ పట్ల బీసీసీఐకి మర్యాద, మన్నన లేవని సుప్రీంకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. జస్టిస్ లోధా కమిటీ ప్రతిపాదనలు ఎందుకు అమలు చేయడం లేదని బీసీసీఐని సూటిగా ప్రశ్నించింది. 24 గంటల్లోగా అమలు చేయకుంటే, రేపు ఉత్తర్వులు జారీ చేస్తామని హెచ్చరించింది. బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ అర్హతపై సుప్రీంకోర్టు పలు ప్రశ్నలు లేవనెత్తింది. ఒకే ఒక్క రంజీ మ్యాచ్ ఆడిన అతడు బీసీసీఐ అధ్యకుడా అని ఆక్షేపించింది. ఫస్ట్ క్లాస్ ప్లేయరా, ఫస్ట్ క్లాస్ క్రికెటరా అని ప్రశ్నించింది. తాము క్రికెటర్లమేనని, న్యాయమూర్తుల జట్టుకు తాను కెప్టెన్ అని చీఫ్ జస్టిస్ టీఎస్ ఠాకూర్ వ్యాఖ్యానించారు.

బీసీసీఐ తీరును సర్వోన్నత న్యాయస్థానికి అమికస్ క్యూరీ గోపాల్ సుబ్రమణియం నివేదించారు. డబ్బు పంపిణీ చేయొద్దని జస్టిస్ లోధా కమిటీ చెప్పినా బీసీసీఐ పట్టించుకోలేదని తెలిపారు. అనుబంధ సంఘాలకు రూ. 400 కోట్లు పంపిణీ చేసిందని వెల్లడించారు. లోధా కమిటీకి వ్యతిరేకంగా ఓట్లు వేయించేందుకే ఈ ప్రయత్నం చేసిందని ఆరోపించారు. కాగా, 24 గంటల్లో లోధా కమిటీ ప్రతిపాదనలు అమలు చేయలేమని కోర్టుకు బీసీసీఐ తెలిపింది. తమ ఆదేశాలను పాటించకుండా బీసీసీఐ రద్దు దిశగా సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకునే అవకాశముందని వార్తలు వస్తున్నాయి.

Advertisement
Advertisement