రైలులో అనుమానిత ఉగ్రవాది అరెస్టు! | Sakshi
Sakshi News home page

రైలులో అనుమానిత ఉగ్రవాది అరెస్టు!

Published Tue, Jul 5 2016 12:16 PM

రైలులో అనుమానిత ఉగ్రవాది అరెస్టు! - Sakshi

కోల్కతా: ఓ అనుమానిత ఉగ్రవాదిని అరెస్టు చేసినట్లు ఎన్ఐఏ అధికారులు స్పష్టం చేశారు. పశ్చిమ బెంగాల్ లోని బుర్ద్వాన్ రైల్వే స్టేషన్ లో అతడిని సోమవారం సాయంత్రం అదుపులోకి తీసుకున్నట్లు మంగళవారం ఉదయం ఎన్ఐఏ అధికారులు ధ్రువీకరించారు.

బుర్ద్వాన్ రైల్వే స్టేషన్ లో అనుమానిత ఉగ్రవాది కదలికలు ఉన్నాయని ఇంటెలిజెన్స్ విభాగం చెప్పడంతో తరలిన ఎన్ఐఏ అధికారులు విశ్వభారతి ఫాస్ట్ ప్యాసింజర్ రైలులో ఉన్న 23 ఏళ్ల యువకుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. బీర్బం జిల్లాలోని లాభ్పూర్ గ్రామానికి ఆ యువకుడు ప్రయాణిస్తున్నాడని, హౌరా రైల్వే స్టేషన్ లో అతడు విశ్వభారతి ఫాస్ట్ ప్యాసింజర్ ఎక్కాడని అంటున్నారు. ఆ యువకుడు కూడా హౌరాకు చెందినవాడే అని ఎన్ఐఏ అధికారులు చెబుతున్నారు. ఏ ఉగ్రవాద సంస్థతో అతడికి సంబంధాలు ఉన్నాయనే అంశాన్ని విచారణలో తెలుసుకుంటామన్నారు.

Advertisement
Advertisement