2018 వరకు ఆగవలసిందే! | Sakshi
Sakshi News home page

2018 వరకు ఆగవలసిందే!

Published Mon, Feb 16 2015 3:17 AM

2018 వరకు ఆగవలసిందే! - Sakshi

 న్యూఢిల్లీ:  స్విట్జర్లాండ్ బ్యాంకుల్లో నల్లధనం దాచిన భారతీయుల ఖాతాల వివరాలను తెలుసుకునేందుకు 2018 వరకు ఆగవలసి ఉంటుంది. పన్ను ఎగవేత, మోసాలను అరికట్టేలా ప్రపంచ దేశాలు పరస్పరం సహకరించుకునే ఉద్దేశంతో ఆర్గనైజేషన్ ఆఫ్ ఎకనమిక్ కోపరేషన్ అండ్ డెవలప్‌మెంట్(ఓఈసీడీ) రూపొందించిన పరస్పర సమాచార మార్పిడి విధానం ‘ఆటోమాటిక్ ఇన్ఫర్మేషన్ ఎక్ఛ్సేంజ్’కు భారత్, స్విట్జర్లాండ్ సహా దాదాపు వంద దేశాలు ఆమోదించాయి. అయితే, ఈ సమాచార మార్పిడి విధానం భారత్ సహా 58 దేశాల్లో 2017లోనే అమల్లో వస్తుండగా, స్విట్జర్లాండ్‌తో పాటు మరో 34 దేశాల్లో 2018లో అమల్లోకి రానుంది.

అందువల్ల భారతీయుల స్విస్ బ్యాంక్ ఖాతాల వివరాలు ఈ విధానం ద్వారా భారత ప్రభుత్వానికి 2018లోనే అందుతాయి. ఈ విధానం అమల్లోకి వచ్చిన తరువాత స్విస్ బ్యాంకుల్లో ఖాతాలున్న వారి అకౌంట్ నెంబర్, పేరు, చిరునామా, పన్ను గుర్తింపు సంఖ్య, వడ్డీ, డివిడెండ్, ఇన్సూరెన్స్ పాలసీల వివరాలు, షేర్లు, బాండ్ల వివరాలు.. మొదలైన సమాచారం అంతా భారత్ తెలుసుకునే అవకాశం ఉంటుంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement