ముగ్గురు విదేశీయుల అరెస్ట్ | Sakshi
Sakshi News home page

ముగ్గురు విదేశీయుల అరెస్ట్

Published Wed, Jan 27 2016 3:38 PM

Syrian Man Detained By Police In Goa Allegedly For 'Overstaying'

పణజి: ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ శాఖ మంత్రి మనోహర్‌ పరీకర్‌ లను చంపేస్తామని హెచ్చరించిన కేసులో గోవా పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసులో ముగ్గురు విదేశీయులను పోలీసులు గుర్తించారు. సిరియాకు చెందిన ఓ వ్యక్తి, మరో ఇద్దర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

వీసా గడువు ముగిసినా ఇంకా దేశంలోనే ఉంటున్న వీరిని ఒక క్లబ్ లో అదుపులోకి తీసుకున్నామని పోలీస్ ఉన్నతాధికారి గార్గ్ వెల్లడించారు. తీవ్రవాద సంస్థతో వీరికి  ఏమైనా సంబంధాలున్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. గోవా ముఖ్యమంత్రి లక్ష్మీకాంత్‌ పర్సేకర్‌ ఈ వార్తలను ధృవీకరించారు. యెమన్‌, నైజీరియాలకు చెందిన వారిగా అనుమానిస్తున్న వీరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారని తెలిపారు.

ప్రధాని, మంత్రి మనోహర్‌ పరీకర్‌ లను బెదిరిస్తూ ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాద సంస్థ పేరుతో ఇటీవల గోవా సెక్రటేరియట్‌కు బెదిరింపు లేఖ వచ్చిన సంగతి తెలిసిందే.

Advertisement

తప్పక చదవండి

Advertisement