ప‌రీక్ష‌లు ర‌ద్దు చేసిన త‌మిళ స‌ర్కార్ | Sakshi
Sakshi News home page

ప‌ది, ప‌ద‌కొండో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు ర‌ద్దు

Published Tue, Jun 9 2020 3:31 PM

Tamilnadu Govt Cancels 10th,11th Board Exams  - Sakshi

చెన్నై : ప‌ది, ప‌దకొండో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల‌ను ర‌ద్దు చేస్తున్న‌ట్లు మంగ‌ళ‌వారం తమిళనాడు ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. ఎలాంటి ప‌రీక్ష‌లు లేకుండానే వారిని పై త‌ర‌గ‌తుల‌కు పంపిస్తున్నట్లు తెలిపింది.  రాష్ట్రంలో క‌రోనా కేసులు అత్య‌ధికంగా న‌మోద‌వుతున్నందున ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు  ముఖ్య‌మంత్రి ప‌ళ‌నిస్వామి తెలిపారు. అయితే జూన్ 15న ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు నిర్వ‌హించేందుకు అనుమ‌తించాల‌ని ప్ర‌భుత్వం కోర‌గా హైకోర్టు మొట్టికాయ‌లు  వేసింది. క‌రోనా కార‌ణంగానే విద్యాసంస్థ‌లు మూసివేస్తే ప‌రీక్ష‌లు ఎలా నిర్వ‌హించ‌గ‌ల‌రని ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించింది. బోర్డు ఎగ్జామ్స్‌ పేరిట ల‌క్ష‌ల మంది విద్యార్థుల ప్రాణాల‌ను ప్ర‌మాదంలోకి నెట్టివేయ‌లేమ‌ని స్ప‌ష్టం చేసింది. వారి ప్రాణాల‌కు ప్ర‌భుత్వం బాధ్య‌త వ‌హించ‌గ‌ల‌దా అంటూ సూటిగా ప్ర‌శ్నించింది. అంతేకాకుండా ప‌రిస్థితి అదుపులోకి వ‌చ్చే వ‌ర‌కు ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌డానికి వీల్లేద‌ని రాష్ట్ర హైకోర్టు ఆదేశించింది. ఆ నేప‌థ్యంలో ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు రద్దు చేస్తున్న‌ట్లు త‌మిళ‌నాడు స‌ర్కార్ ప్ర‌క‌టించింది. 
(గ‌తేడాది ఆగ‌స్టులోనే క‌రోనా ఆన‌వాళ్లు)

తమిళనాడులో ప్రతిరోజూ కేసుల సంఖ్య పెరుగుతున్నందున 10, 11వ త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల‌ను ర‌ద్దు చేయాల్సిందిగా తమిళనాడు హై అండ్ హయ్యర్ సెకండరీ స్కూల్ గ్రాడ్యుయేట్ టీచర్స్ అసోసియేషన్ బోర్డుకు విన్న‌వించుకుంది. అయిన‌ప్ప‌టికీ ప్ర‌భుత్వం మాత్రం జూన్ 15 నుంచే ప‌రీక్ష‌లు ఉంటాయ‌ని ప్ర‌క‌టించ‌డంతో విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. ప్రభుత్వం విద్యార్థుల ప్రాణాలను  ప్ర‌మాదంలోకి నెట్టివేస్తుంద‌ని ఎంఎస్‌ఎంకే చీఫ్ వైకో  అన్నారు. (ఉద్యోగాలు క‌ల్పించండి : సుప్రీం ఆదేశం )

Advertisement
Advertisement