30 కోట్లతో మోదీకి గుడి | Sakshi
Sakshi News home page

వంద అడుగుల విగ్రహంతో మోదీకి గుడి

Published Thu, Oct 5 2017 10:18 AM

Temple for PM Modi to be built in Meerut - Sakshi

సాక్షి, పంచకుల :  టీ అమ్ముకున్న స్థాయి నుంచి.. దేశ ప్రధానిగా ఎదిగిన నరేంద్ర దామోదర్‌దాస్ మోదీకి ప్రత్యేక అభిమానగణం ఉన్న విషయం తెలిసిందే. ఆ అభిమానంతోనే ఆయన వంద అడుగుల విగ్రహంతో మీరట్‌లో ఓ గుడిని నిర్మించేందుకు ముందుకొచ్చారు హర్యానాకు చెందిన ఓ రిటైర్డ్‌ ఇంజనీర్‌. 

ఇరిగేషన్‌ డిపార్ట్‌మెంట్‌లో ఇంజనీరింగ్‌గా పని చేసి రిటైర్డ్‌ అయిన జేపీ సింగ్‌కు మోదీ అంటే చాలా ఇష్టం. ఆయన(మోదీ) సిద్ధాంతాలు, పాలన నన్ను ఎంతగానో ఆకర్షించాయి. దశాబ్దం పైగా నేను ఆయన అభిమానిని. ఆయన కోసం ఏదైనా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా.. కానీ, ప్రభుత్వ ఉద్యోగంలో ఉండటం మూలానా వీలు కాలేదు. ఇప్పుడు రిటైర్డ్‌ అయ్యాను కాబట్టి మార్గం సులభతరం అయ్యింది అని సింగ్‌ చెప్పుకొచ్చారు. 

అక్టోబర్‌ 23న ఈ గుడి భూమి పూజ నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఇక కార్యక్రమానికి బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా హాజరయ్యే అవకాశం ఉంది. మీరట్‌-ఖర్నా హైవేలోని సార్ధనా ప్రాంతంలో ఐదు ఎకరాల భూమిలో ఈ ఆలయ నిర్మాణం చేపడుతుండగా..  సుమారు 30 కోట్లు ఖర్చవుతుందని అంచనా. ఇందుకోసం ఆ మాజీ ఉద్యోగి ప్రజల నుంచి విరాళాలు కూడా సేకరించారంట. వంద అడుగుల మోదీ విగ్రహాంతో సుమారు రెండేళ్లలో గుడి నిర్మాణం పూర్తి చేస్తామని సింగ్‌ వెల్లడించారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement