Sakshi News home page

ఏపీకి త్వరలో తాత్కాలిక హైకోర్టు

Published Fri, Dec 29 2017 1:45 AM

Temporary High Court soon in AP - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ఏర్పా టుకు వీలుగా తాత్కాలిక భవనాలను ప్రతి పాదిస్తూ ఏపీ ప్రభుత్వం హైకోర్టుకు తెలియ పరిచే ప్రక్రియలో ఉందని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ గురువారం లోక్‌ సభలో వెల్లడించారు. తాత్కాలిక భవనాల్లో ఉన్నత న్యాయ స్థానం ఏర్పాటుకు హైకోర్టు సమ్మతిస్తే తాత్కాలిక పద్ధతిలో అక్కడికి ఏపీ హైకోర్టును తరలించే వీలుంటుందని తెలి పారు. ఈ అంశంపై బుధవారం లోక్‌సభ కార్య కలాపాలను టీఆర్‌ఎస్‌ సభ్యులు అడ్డుకున్న నేపథ్యంలో గురువారం మధ్యా హ్నం ఆయన లోక్‌సభలో ఈ మేరకు ప్రకటన చేశారు.

‘‘ఆంధ్రప్రదేశ్‌కు కొత్త హైకోర్టు భవనం నిర్మిం చేందుకు సమ యం పడుతుంది. చట్ట ప్రకారం ప్రస్తుత ఏపీ హైకోర్టు తెలంగాణకు చెందుతుంది. ఆంధ్ర ప్రదేశ్‌ భూ భాగంలో ప్రత్యేక హైకోర్టు రావాల్సి ఉంది. ఏపీలో నూతన హైకోర్టు భవన ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు నాకు సమా చారం ఉంది. కేంద్రం కూడా రాజధాని భవనాలకు నిధులు ఇస్తోంది. అయితే ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు నుంచి ఒక ఉత్తర్వు ఉంది. ఏపీ ముఖ్యమంత్రి హైకోర్టు కోసం ఒక స్థలాన్ని సూచిస్తూ తమకు ప్రతి పాదించాలని, హైకోర్టుతో సంప్రదింపులు జర పాలని ఆ ఉత్తర్వు సారాంశం.

ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం ప్రత్యేక హైకోర్టు ఏర్పాటుకు వీలుగా తాత్కాలిక భవనాలను ప్రతిపాదిస్తూ హైకోర్టుకు తెలియపరిచే ప్రక్రియలో ఉంది. ఆయా భవనాలకు హైకోర్టు సమ్మ తిస్తే లేదా ఏవైనా మార్పులు సూచిస్తే దానికి అను గుణంగా తాత్కాలిక పద్ధతిలో హైకోర్టును హైదరాబాద్‌ నుంచి తరలించవచ్చు. ఇక కొత్త భవనం నిర్మాణం కావాలంటే అందుకు సమ యం పడుతుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ మి త్రులకు నేను చెప్పగలిగిందేమంటే వారు పరస్పరం ప్రేమ, గౌరవం ఇచ్చిపుచ్చుకోవా లి. కేంద్ర ప్రభుత్వం వారి ప్రయోజనాలను ఎప్పుడూ దృష్టిలో పెట్టుకుంటుంది’’ అని రవిశంకర్‌ ప్రసాద్‌ పేర్కొన్నారు.

అప్పటివరకు వద్దు: జితేందర్‌రెడ్డి
న్యాయశాఖ మంత్రి ప్రకటన అనంతరం టీఆర్‌ఎస్‌ లోక్‌సభాపక్ష నేత జితేందర్‌రెడ్డి మాట్లాడుతూ ‘‘ఏపీ ముఖ్యమంత్రి తాత్కాలిక హైకోర్టుకు నాలుగు భవనాలు ప్రతిపాదించినట్లు సమాచారం. దీనిని మేం స్వాగతిస్తున్నాం. అయితే ప్రత్యేక హైకోర్టు ఏర్పాటయ్యే వరకు న్యాయాధి కారులు, న్యాయమూర్తుల పదోన్నతుల ప్రక్రియను నిలిపివేయాలి.

అది జరిగితే తెలంగాణ న్యాయవాదులు, న్యాయాధి కారులకు అన్యాయం జరుగుతుంది. అది తాత్కాలిక ఏర్పాటైనా, శాశ్వత ఏర్పాటైనా మాకు అభ్యంతరం లేదు. కానీ హైకోర్టు ఏర్పాటయ్యే వరకు న్యాయాధికారుల పదోన్నతుల ప్రక్రియ మాత్రం వద్దు’’ అని విన్నవించారు. దీనికి న్యాయ మంత్రి స్పందిస్తూ ‘‘న్యాయమూర్తుల నియామ కాల ప్రక్రియను కొలీజియం చేపడుతుంది. దీనిపై నేను ఎలాంటి హామీ ఇవ్వలేను’’ అని పేర్కొన్నారు.


ఇద్దరు సీఎంలు కలసి మాట్లాడుకోవాలి: రాజ్‌నాథ్‌
ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టానికి సంబం ధించి హైకోర్టు మినహా ఇతర అంశాలను పరిష్కరించుకునేందుకు వీలుగా కలసి మాట్లాడుకోవాలని ఇరు రాష్ట్రాల సీఎంలను కోరతానని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ లోక్‌సభలో తెలిపారు. విభజనకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న అంశాలన్నీ పరిష్కారం అయ్యేందుకు తన వంతు పూర్తిస్థాయిలో కృషి చేస్తానని హామీ ఇచ్చారు. 

Advertisement
Advertisement