ప్రసాదం బదులు..విత్తనాలు పంపిణీ | Sakshi
Sakshi News home page

ప్రసాదం బదులు..విత్తనాలు పంపిణీ

Published Mon, Aug 28 2017 7:52 PM

ప్రసాదం బదులు..విత్తనాలు పంపిణీ

సాక్షి, ముంబై:  ఠాణేకు చెందిన ఓ గణేశ్‌ మండలి వినూత్న రీతిలో భక్తులకు ప్రసాదం పంచి పెడుతోంది. భక్తులకు ప్రసాదం బదులుగా విత్తనాలు పంపిణి చేస్తున్నారు. శ్రీరంగ్‌ సహనివాస్‌ గణేశోత్సవ్‌ మండల్‌ తమ మండలిని సందర్శించేందుకు వచ్చిన భక్తులకు ప్రసాదం బదులుగా విత్తనాలు పంపిణి చేస్తున్నారు. సీతాఫల్, బల్‌సమ్‌ (ఒక రకమైన తైలం), గుమ్మడి కాయ, నారింజ, నిమ్మకాయ, సపోట, జీడి పప్పు, చింత పండు, కర్జూరం తదితర విత్తనాలు మట్టితో రోల్‌ చేసి (సీడ్‌ బాల్స్‌) భక్తులకు ఇస్తున్నారు. వీటిని భక్తులు పక్క ఇంటి పెరట్లో లేదా ఇంటి ఆవరణంలో స్థలం ఉన్నా అక్కడ నాటాల్సిందిగా సూచిస్తున్నారు. 

ఇప్పటి వరకు ఆ మండలి 8,000 క్లే బాల్స్‌ (విత్తనం ఉంచిన మట్టి ఉండ)ను తయారు చేసింది. మరి కొన్ని రోజుల్లో మరో 25 వేల క్లే బాల్స్‌ను తయారు చేసి భక్తులకు పంపిణి చేస్తామని మండలి నిర్వాహకులు తెలిపారు. అయితే ఉత్సవాల సమయంలో విత్తనాన్ని దానం చేసేందుకు వీలుగా వీటిని సీడ్స్‌ బాంబ్‌లుగా మార్చారు. 
 
ఈ సందర్భంగా మండలి అధ్యక్షుడు ప్రమోద్‌ సావంత్‌ మాట్లాడుతూ.. తాము క్లీన్‌ అండ్‌ గ్రీన్‌ పర్యావరణాన్ని నమ్ముతామన్నారు. దీంతో తాము ఈ ఏడాది భక్తులు విత్తనాలను నాటేందుకు సీడ్‌ బాంబులను ప్రసాదంగ పంపిణి చేస్తున్నామన్నారు. ఈ విధానం ద్వారా తమకు మంచి స్పందన లభిస్తుందని తెలిపారు.  వివిధ మార్గాల ద్వారా తాము విత్తనాలను సేకరించామని ఆయన తెలిపారు. అంతేకాకుండా స్థానిక పాఠశాల విద్యార్థులు, వాలెంటీర్లు కూడా సీడ్‌ బాంబ్స్‌ను తయారు చేయడంలో పాలుపంచుకున్నారని తెలిపారు. మండలి సంయుక్త కార్యదర్శి ఓంకార్‌ పట్నే ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గౌరీ తనయుడు ఆశీర్వాదం పొందేందుకు భక్తులు తమ మండపానికి దర్శించుకునేందుకు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు ఈకో–ఫ్రెండ్లీ గణేష్‌ సందేశంతో పాటు పర్యావరణానికి హాని కలుగకుండా గణేష్‌ ఉత్సవాలను నిర్వహించాల్సిందిగా కోరుతున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement