ట్రిపుల్ తలాక్ క్రూరమైనది | Sakshi
Sakshi News home page

ట్రిపుల్ తలాక్ క్రూరమైనది

Published Fri, Dec 9 2016 2:23 AM

ట్రిపుల్ తలాక్ క్రూరమైనది - Sakshi

ముస్లిం పర్సనల్ లా సవరణలకు అవకాశం ఉందా?
ముస్లిం మహిళల బాధలు తగ్గించేందుకు సవరణలు అవసరం
తీర్పును స్వాగతించిన కేంద్రం, మహిళా పర్సనల్ లా బోర్డు

దీని వల్ల న్యాయ వ్యవస్థ అంతరాత్మ క్షోభిస్తోంది  
అలహాబాద్ హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు

 
అలహాబాద్: ముస్లిం మహిళల హక్కులను కాలరాసే ట్రిపుల్ తలాక్ క్రూరమైనదని అలహాబాద్ హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ట్రిపుల్ తలాక్ వల్ల న్యాయ వ్యవస్థ అంత రాత్మ తీవ్రంగా క్షోభిస్తోందని ఆందోళన వ్యక్తం చేసింది. ముస్లిం మహిళల బాధలు తగ్గించేలా ముస్లిం పర్సనల్ లాలో సవరణ లకు అవకాశం ఉందా? అని ప్రశ్నించింది. తక్షణ విడాకులైన ‘ట్రిపుల్ తలాక్’కు ప్రస్తు తం చాలా డిమాండ్ ఉందని, ఇది ఒక దేశంగా భారత్ ఉండకుండా అడ్డుకుంటోందని ఆందో ళన వ్యక్తం చేసింది. ఏ సామాజిక వర్గానికి చెందిన పర్సనల్ లా అరుునా రాజ్యాంగం కల్పించిన హక్కులకు అతీతం కాదని వ్యాఖ్యా నించింది.

‘‘కోర్టులను ఈ అంశం ఆందోళన కు గురిచేస్తోంది. ముస్లిం మహిళలు ఈ క్రూరమైన, నిరంకుశమైన విధానంతో ఇంకెం త కాలం బాధలు పడాలి? ఇలాంటి భార్యల పట్ల వారి పర్సనల్ లా ఇంకా క్రూరంగానే ఉందా? వారి బాధలను తీర్చే విధంగా పర్సనల్ లాకు సవరణలు చేసేందుకు ఏమైనా అవకాశం ఉందా? ఈ అరాచకత్వం న్యాయ వ్యవస్థ అంతరాత్మను క్షోభకు గురిచేస్తోంది’’ అని న్యాయమూర్తి సునీత్ కుమార్ నేతృత్వంలోని ఏక సభ్య ధర్మాసనం గత నెలలో తీర్పు వెలువరించింది. భారత్ లోని ముస్లిం చట్టాలు.. మత ప్రవక్త, పవిత్ర గ్రంథం ఖురాన్ చెప్పిన అంశాల స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నాయని, ఇదే పద్ధతి భార్యలకు విడాకులు ఇచ్చే విషయంలోనూ కొనసాగు తోందని పేర్కొంది. ఆధునిక, లౌకికవాద దేశంలో చట్టం ఉద్దేశం.. సామాజిక మార్పును తీసుకురావడమేనని తెలిపింది. భారత్‌లో ముస్లిం జనాభా పెద్ద సంఖ్యలో ఉందని, ఇం దులోని ఎక్కువ మంది ముఖ్యంగా మహిళలను పురాతన ఆచారాలు, సామాజిక కట్టుబాట్ల పేరిట పర్సనల్ లాలోని ఆంక్షలతో నియంత్రించడం తగదని చెప్పింది.

‘ఇస్లాం లో తీవ్రమైన అత్యవసర పరిస్థితులు ఏర్పడి నప్పుడు మాత్రమే విడాకులకు అనుమతి ఉంది. సయోధ్య కుదిర్చే మార్గాలన్నీ విఫలమైనప్పుడు మాత్రమే పెళ్లిని రద్దు చేయడానికి తలాక్ లేదా ఖోలా ద్వారా విడాకులకు ముందుకు వెళ్లొచ్చు’ అని పేర్కొంది. అరుుతే ప్రస్తుతం ముస్లిం భర్తలు ఇస్లామిక్ ఆదేశాలను పట్టించుకోకుండా ఏకపక్షంగా ఈ తక్షణ విడాకులకు ప్రయ త్నిస్తున్నారని చెప్పింది. తన భార్య నిజాయతీగా, విధేయురాలై ఉన్నంత వరకూ ఒక వ్యక్తి ఆమెకు విడాకులు ఇచ్చేందుకు అవకాశం లేదని ఖురాన్ చెపుతోందని నవంబర్ 5న జారీ చేసిన ఆదేశాల్లో ధర్మాసనం పేర్కొంది.

ఇస్లామిక్ చట్టం పెళ్లిని రద్దు చేసేందుకు మగవారికి ప్రాథమికంగా అవకాశమిస్తోం దని, ఆమె ప్రవర్తన సరిగా లేకపోరుునా, విధేయత చూపించకపోరుునా, పెళ్లి తర్వాత జీవితం సంతృప్తికరంగా లేకపోరుునా విడాకు లు ఇవ్చొచ్చని, అరుుతే ప్రస్తుతం ఎటువంటి తీవ్ర కారణాలు లేకుండానే మగవారు విడాకులు ఇస్తున్నారని, మతపరంగానూ.. అలాగే చట్టపరంగానూ వీరు తమ విడాకులను సమర్థించుకోలేక పోతున్నారంది. యూపీకి చెందిన హినా(23), ఆమె భర్త దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేస్తూ కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. కాగా.. ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు మాత్రం ట్రిపుల్ తలాక్‌కు మద్దతుగా నిలిచింది. హైకోర్టు తీర్పుపై అప్పీలు చేస్తామని ప్రకటించింది.
 
స్వాగతించిన కేంద్రం, మహిళా లా బోర్డు

ట్రిపుల్ తలాక్‌కు సంబంధించి అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును కేంద్ర ప్రభుత్వం, ఆల్ ఇండియా ముస్లిం ఉమెన్ పర్సనల్ లా బోర్డు స్వాగతించింది. దీనిపై కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ మంత్రి వెంకయ్య నాయుడు స్పందిస్తూ.. మహిళలకు న్యాయం జరగాలని, అందరూ అంగీకరి స్తారని చెప్పారు.

Advertisement
 
Advertisement