నవల రాసిన రోబో! | Sakshi
Sakshi News home page

నవల రాసిన రోబో!

Published Mon, Apr 25 2016 10:35 PM

నవల రాసిన రోబో! - Sakshi

న్యూఢిల్లీ: రోబో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్తో పనిచేసే మానవ నిర్మిత సాధనం. మరి ఇది ఏం చేస్తుందీ.. మనం తయారు చేసుకుందే కదా అనుకుంటే పొరపాటే. ప్రస్తుతం ఆటోమొబైల్ రంగంలో మానవప్రాధాన్యం బాగా తగ్గుతుండానికి గల కారణం ఆటోమేషన్ ద్వారా పనిచేసే ఈ రోబోలే.

ఎప్పుడూ ఏదో ఒక పనికి ఉపయోగపడేలా తయారుచేసే ఈ రోబోలు తాజాగా రచయిత అవతారం ఎత్తాయి. ఒక చిన్నపాటి నవలను రాయడమే కాకుండా దానికి ప్రైజ్ను కూడా గెలిచినంత పని చేసేసింది. జపాన్లో నవలా రచయితలకు అందజేసే నిక్కీ హోషీ అవార్డుకు నాన్ హ్యూమన్ కేటగిరీ కింద నిర్వహించిన పోటీల్లో ఈ రోబో పాల్లొంది. ఫ్యూచర్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ హితోషీ మత్సుబరా ఆధ్వర్యంలో ఈ రోబోకు ప్రోగ్రామింగ్ను తయారుచేశారు.

మొత్తం 1450కు పైగా అందిన ఏంట్రీల్లో ఈ రోబో 11 నవలను రాసింది. మొత్తం నాలుగు స్టేజీల్లో నిర్వహించే పోటీల్లో ఒక నవల మాత్రమే మొదటి స్టేజ్ను దాటింది.

Advertisement
Advertisement