పరీక్షల్లో చిట్టీలందిస్తే జైలుకే.. | Sakshi
Sakshi News home page

పరీక్షల్లో చిట్టీలందిస్తే జైలుకే..

Published Wed, Jan 20 2016 2:36 AM

To jail itself if cheat

పట్నా: ఇకపై పరీక్షలు రాస్తున్న 10, 12 తరగతుల విద్యార్థులకు చిట్టీలు అందిస్తూనో.. ఇతర అక్రమాలకు పాల్పడుతూనో దొరికిన వారిని జైలు పంపనుంది బిహర్ ఎగ్జామినేషన్ బోర్డు. అలాగే, కాపీ చేస్తూ పట్టుబడిన విద్యార్థికి రూ. 2 వేల నుంచి గరిష్టంగా రూ.20 వేల వరకూ జరిమానా విధించనున్నారు. ఆ విద్యార్థిని మూడేళ్ల వరకు డిబార్ చేయాలని కూడా నిర్ణయించారు. బిహర్‌లో పరీక్షల సమయంలో తల్లిదండ్రులు, స్నేహితులు, బంధువులు ఇలా ఎవరికి వీలైతే వారు పరీక్ష రాస్తున్న విద్యార్థులకు మాస్‌కాపీయింగ్‌లో సహకరిస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో.. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు అక్కడి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. బిహర్ పాఠశాల పరీక్షా బోర్డు చైర్మన్ లాల్ కేశ్వర్ ప్రసాద్ సింగ్ ఈ వివరాలను మంగళవారం మీడియాకు తెలియజేశారు.
 

Advertisement
Advertisement