నేటి వార్తల్లో ముఖ్యాంశాలు | Sakshi
Sakshi News home page

నేటి వార్తల్లో ముఖ్యాంశాలు

Published Wed, Jun 14 2017 8:29 AM

today news updates

నేడు సినారె అంత్యక్రియలు
హైదరాబాద్: డాక్టర్‌ సి.నారాయణరెడ్డి అంత్యక్రియలు బుధవారం నిర్వహించనున్నారు. ఉదయం  8 గంటలకు  పుప్పాలగూడ డాలర్‌హిల్స్‌లోని ఆయన స్వగృహం నుంచి షేక్‌పేట్‌ నాలా, మెహదీపట్నం, ఆబిడ్స్‌ మీదుగా తిలక్‌రోడ్డులోని తెలంగాణ సారస్వతపరిషత్తుకు ఆయన పార్థివ దేహాన్ని చేరుస్తారు. ఉదయం 9  నుంచి 10 గంటల వరకు కవులు, రచయితల సందర్శనార్ధం అక్కడ ఉంచుతారు. ఆ తర్వాత సారస్వతపరిషత్తు నుంచి అంతిమయాత్ర ప్రారంభమవుతుంది. అబిడ్స్, నాంపల్లి, లక్డీకాపూల్, మెహదీపట్నం, టోలీచౌకి, విస్పర్‌వ్యాలీ మీదుగా మహాప్రస్థానం శ్మశానవాటికకు చేరుకుంటుంది.

రాజ్‌భవన్‌లో ఇఫ్తార్ విందు
హైదరాబాద్: నేటి సాయంత్రం రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్ ఇఫ్తార్ విందు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సీఎంలకు ఆహ్వానం పంపిన గవర్నర్

కేంద్ర మంత్రితో పెట్రో డీలర్ల భేటీ
అమరావతి: దేశ వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వరంగ చమురు సంస్థలకు చెందిన 58 వేల పెట్రోల్‌ బంకుల్లో జూన్‌ 16 నుంచి పెట్రోల్, డీజిల్‌ ధరలు రోజూ మారనున్నాయి. ఈ విషయంపై నేడు కేంద్ర పెట్రోలియం, ఇంధనశాఖ మంత్రితో పెట్రో డీలర్ల భేటీ కానున్నారు.

నేడు మంద్‌సౌర్‌కు శివరాజ్ చౌహాన్
మంద్‌సౌర్: అట్టుడుకుతున్న మంద్‌సౌర్‌లో బుధవారం పర్యటించనున్న మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్. బాధిత రైతుల కుటుంబాలను పరామర్శించనున్న సీఎం చౌహాన్

నేడు జూనియర్‌ కళాశాలల బంద్‌
హైదరాబాద్‌: ఇంటర్మీడియట్ ప్రవేశాలకు ఆన్‌లైన్ అడ్మిషన్లు అమలు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం వెనుకడుగు వేయటం కార్పొరేట్ కళాశాలలకు రెడ్ కార్పెట్ పరచటమే అని ఏబీవీపీ ఆరోపించింది. తమ డిమాండ్ల సాధనకు, ప్రభుత్వ జూనియర్ కళాశాలను బలోపేతానికి ఈనెల 14వ తేదీన జూనియర్ కళాశాలల రాష్ట్ర వ్యాప్త బంద్ కు పిలుపు ఇచ్చింది. కార్పొరేట్ కళాశాలల్లో ఆత్మహత్యలు, విద్యార్థుల మిస్సింగ్ లపై విచారణ జరిపించాలని డిమాండ్‌ చేసింది.

'ఇఫ్తార్ విందు' పిల్‌పై విచారణ
హైదరాబాద్: ఇఫ్తార్ విందుపై దాఖలైన పిల్‌పై నేడు విచారణ చేపట్టనున్న హైకోర్టు.

నేడు 'రాజ్‌భవన్ పాఠశాల' ప్రారంభం
హైదరాబాద్: నేడు 'రాజ్‌భవన్ పాఠశాల' ప్రారంభం. ఉదయం 10 గంటలకు ప్రారంభించనున్న గవర్నర్ నరసింహన్

అమరావతి: ఆర్టీసీ ఏకపక్ష నిర్ణయాలపై నేడు ఆందోళనలు

చాంపియన్స్ ట్రోఫీ
ఇవాళ తొలి సెమీస్‌లో ఇంగ్లండ్‌తో తలపడనున్న పాకిస్తాన్. మధ్యాహ్నం 3 గంటలకు కార్డిఫ్‌ లో మ్యాచ్ ప్రారంభం.
 

Advertisement
Advertisement