నేటి వార్తల్లో ముఖ్యాంశాలు | Sakshi
Sakshi News home page

నేటి వార్తల్లో ముఖ్యాంశాలు

Published Fri, Jun 16 2017 8:30 AM

today news updates

వైఎస్ఆర్ జిల్లాలో రెండో రోజు వైఎస్ జగన్ పర్యటన
కడప: వైఎస్సార్‌ జిల్లా కడపలో వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటన రెండో రోజు కొనసాగుతోంది. నేడు వీఎన్‌పల్లి మండలం పాయంపల్లిలో ఆత్మహత్యకు పాల్పడ్డ రైతు హర్షవర్ధన్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించనున్న వైఎస్ జగన్. సాయంత్రం మైదుకూరు ఎమ్మెల్యే రఘువీరారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొననున్నారు.

ప్రతిపక్ష పార్టీ నేతలతో కేంద్ర మంత్రుల భేటీ
న్యూఢిల్లీ: నేడు ప్రతిపక్ష పార్టీ నేతలతో భేటీ కానున్న కేంద్ర మంత్రులు మంత్రి రాజ్‌నాథ్ సింగ్, వెంకయ్య నాయుడు. ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీ, ఏచూరిని కలవనున్న కేంద్ర మంత్రులు. రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై చర్చించనున్న నేతలు

నేడు సీబీఐ ప్రత్యేక కోర్టుకు లాలు ప్రసాద్
రాంచీ: దాణా కుంభకోణం కేసుకు సంబంధించి ఆర్జేడీ అధినేత లాలు ప్రసాద్‌ యాదవ్‌ నేడు జార్ఖండ్ లోని రాంచీ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానానికి హాజరు కానున్నారు. దాణా పంపిణీకి సంబంధించి కోట్లలో కుంభకోణం జరిగినట్లు బయటపడటంతో 45మందిని నిందితులుగా చేర్చారు. గతంలో జార్ఖండ్ కోర్టు లాలూపై నమోదైన కుట్రపూరిత ఆరోపణల్ని కొట్టి వేయగా.. ఇటీవల విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు లాలూ విచారణ ఎదుర్కోవాల్సిందేనని ఆదేశించిన విషయం తెలిసిందే.

పాక్‌కు సాయంపై అమెరికా చర్చలు
వాషింగ్టన్: 'పాకిస్తాన్‌కు ఆర్థిక సాయం' అందించాలా.. వద్దా అన్న దానిపై నేడు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సమీక్షా సమావేశం ఏర్పాటుచేసి నిర్ణయం తీసుకోనున్నారు.

‘డబుల్‌’కు నేడు కేటీఆర్‌ శంకుస్థాపన
హైదరాబాద్: మునిసిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్ శుక్రవారం బాగ్‌లింగంపల్లి లంబాడి తండాలో 126 డబుల్‌బెడ్‌రూమ్‌ ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ, మేడ్చల్‌ జిల్లాలోని అహ్మద్‌ గూడలో 4,428 డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లకు శంకుస్థాపన చేయనున్నారు.  

రోజువారీగా పెట్రోల్, డీజిల్ ధరలు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన పెట్రోల్‌ బంకుల్లో పెట్రోల్, డీజిల్‌ ధరలను శుక్రవారం నుంచి రోజువారీగా సవరించనున్నారు. ఈ విధానాన్ని వ్యతిరేకిస్తూ బంద్‌కు పిలుపునిచ్చిన పెట్రో డీలర్లు తమ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు. ధరలను ప్రతిరోజూ అర్ధరాత్రి కాకుండా ఉదయం ఆరు గంటలకు సవరించాలన్న తమ డిమాండ్‌కు ప్రభుత్వం ఒప్పుకోవడంతో బంద్‌ చేయకూడదని నిర్ణయించామని పెట్రో డీలర్లు చెప్పారు.

నేడు రవీంద్రభారతిలో ‘సారంగి’
హైదరాబాద్: సప్తస్వరమాలి కల్చరల్‌ అసోసియేషన్, హైదరాబాద్, సారంగి కల్చరల్‌ అకాడమీ, ఢిల్లీ సంయుక్తాధ్వర్యంలో శుక్రవారం రవీంద్రభారతిలో ‘సారంగి’ లెగసీ–2017’ కార్యక్రమం జరగనుంది. సాయంత్రం 6.30కి ప్రముఖ సంగీత విద్వాంసుడు సబ్రీఖాన్‌సాహెబ్‌ జ్ఞాపకార్థం దీనిని నిర్వహించనున్నారు.

ఆన్‌లైన్‌లో శ్రీవారి సేవా టికెట్లు
తిరుమల: నేటి ఉదయం 11 గంటల నుంచి అన్‌లైన్‌లో శ్రీవారి సేవా టికెట్లు. సెస్టెంబర్ నెలకు సంబంధించి 44,895 టికెట్లు విడుదల చేయనున్న టీటీడీ   

Advertisement
Advertisement