రాజ్యాంగ సంస్థలను విశ్వసించండి: సీఈసీ | Sakshi
Sakshi News home page

రాజ్యాంగ సంస్థలను విశ్వసించండి: సీఈసీ

Published Fri, May 16 2014 12:57 AM

రాజ్యాంగ సంస్థలను విశ్వసించండి: సీఈసీ - Sakshi

న్యూఢిల్లీ: రాజ్యాంగ వ్యవస్థల పట్ల విశ్వా సం కలిగిఉండాలని రాజకీయ పార్టీలకు ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) వీఎస్ సంపత్ సూచించారు. ‘శేషన్ వస్తారు.. వెళ్తారు. సంపత్ వస్తారు.. వెళ్తారు.. కానీ ఎన్నికల సంఘం అనే రాజ్యాం గ సంస్థ నిరంతరాయంగా కొనసాగుతుంది’ అని అన్నారు. తమ పట్ల ఎన్నికల సంఘం వివక్ష చూపుతోందన్న బీజేపీ విమర్శలపై గురువారం సంపత్ పైవిధంగా స్పందిం చారు. గాంధీనగర్‌లో తమ పార్టీ ఎన్నికల చిహ్నాన్ని మోడీ ప్రదర్శించడం.. ఎవరికి ఓటేశామన్నదాన్ని రహస్యంగా ఉంచాలన్న నిబంధనను అమేథీలో రాహుల్‌గాంధీ ఉల్లంఘించడం.. ఈ రెండు వేరువేరు అంశాలనీ, వాటి ఆధారంగా ఎన్నికల సంఘం వివక్ష చూపిందనడం సరికాదని సంపత్ వ్యాఖ్యానించారు. దీనిపై రాహుల్‌కు క్లీన్‌చిట్ ఇవ్వడంపై బీజేపీ ఈసీపై విమర్శలు చేసిన విషయం తెలిసిందే.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement