భారత పటాన్ని తప్పుగా చూపితే 100 కోట్ల జరిమానా | Sakshi
Sakshi News home page

భారత పటాన్ని తప్పుగా చూపితే 100 కోట్ల జరిమానా

Published Fri, May 6 2016 5:09 AM

Upto Rs 100 crore fine for wrong depiction of India map

న్యూఢిల్లీ: భారత దేశ పటాన్ని తప్పుగా చిత్రీకరించే వారికి కనీసం ఏడేళ్ల జైలు శిక్ష, రూ. 100 కోట్ల జరిమానా విధించేలా ప్రభుత్వం చట్టం చేయనుంది. ఈ మధ్య కొన్ని సామాజిక మాధ్యమాల్లో జమ్మూ కశ్మీర్, అరుణాచల్‌ప్రదేశ్‌లు వరుసగా పాకిస్తాన్, చైనా భూభాగాలని సూచించడం వివాదస్పదమైన సంగతి తెలిసిందే. ప్రతిపాదిత ‘భూ ఖగోళ ప్రాంత సమాచార నియంత్రణ బిల్లు-2016’ ప్రకారం ... భారత భౌగోళిక సమాచారాన్ని సేకరించడం, ప్రచురించడం, పంపిణీచే యడానికి ముందు సదరు సంస్థ తప్పని సరిగా ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాలి.

Advertisement
Advertisement