రాజెకు ముఖంచాటేసిన బీజేపీ పెద్దలు ! | Sakshi
Sakshi News home page

రాజెకు ముఖంచాటేసిన బీజేపీ పెద్దలు !

Published Sat, Jun 27 2015 4:39 PM

రాజెకు ముఖంచాటేసిన బీజేపీ పెద్దలు ! - Sakshi

న్యూఢిల్లీ: లలిత్ మోదీ వివాదంలో కూరుకుపోయిన తమ మహిళానేతలను సమర్థిస్తూ వస్తోన్న బీజేపీ అధిష్ఠానం తాజాగా తన పంథాను మార్చుకుందా? ఆధారాలతో సహా దొరికిపోయిన నాయకురాళ్లపై చర్యలకు ఉపక్రమిస్తుందా? అంటే అవుననే సమాధానాలు వినిపస్తున్నాయి.

శనివారం ఢిల్లీలో చోటుచేసుకున్న పరిణామాలు ఇందుకు ఊతమిస్తున్నాయి. విజ్క్షాన్ భవన్లో ఏర్పటుచేసిన నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొనేందుకు జైపూర్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా ఢిల్లీకి వచ్చిన రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే.. సమావేశం అనంతరం బీజేపీ పెద్దలెవ్వరినీ కలుసుకోకుండానే వెనుదిరిగి వెళ్లిపోయారు. నిజానికి ఆమె ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను కలుస్తారని అంతా భావించారు. అయితే రాజేకు మోదీ, షాల అపాంయింట్మెంట్ ఖరారయిందీ లేనిదీ ఆ పార్టీ నేతలెవ్వరూ పెదవి విప్పడంలేదు.

ఇదే వివాదానికి సంబంధించి అమిత్ షా, కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీలు బుధవారం ప్రధాని మోదీతో సమాలోచనలు జరిపి, ఏ విధంగా ముందుకు వెళ్లాలనే దానిపై ఒక స్పష్టతకు వచ్చినట్లు తెలిసింది.. ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోదీ ఇంగ్లాండ్కు వెళ్లేందుకు రాజే సహాయం చేశారనే విషయం వెలుగులోకి రావడంతో విపక్షాలన్నీ ఆమె రాజీనామాకు పట్టుబడుతున్న సంగతి తెలిసిందే.

Advertisement
Advertisement