సీపీఐ సీనియర్‌ నేత కన్నుమూత | Sakshi
Sakshi News home page

సీపీఐ సీనియర్‌ నేత కన్నుమూత

Published Sat, Jul 8 2017 4:22 PM

సీపీఐ సీనియర్‌ నేత కన్నుమూత - Sakshi

కోయంబత్తూర్: సీనియర్‌ కమ్యూనిస్ట్‌నేత, కురువృద్ధుడు డి. జ్ఞానయ్య(97) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన రెండు రోజుల క్రితమే ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. శుక్రవారం సాయంత్రం శ్వాస సంబంధ సమస్య తలెత్తటంతో ఆయన్ను కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించటంతో శనివారం వేకువజామున 4 గంటలకు ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. మధురై సమీపంలోని తిరుమంగళంలో ఆయన 1940లో జన్మించారు.
 
ఇరవయ్యేళ్ల వయస్సులో కమ్యూనిస్ట్‌పార్టీలో చేరారు. తపాలా శాఖ ఉద్యోగిగా పనిచేస్తూ కార్మిక సంఘనాయకునిగా ఎదిగారు. నేషనల్‌ పోస్ట్‌, టెలికం ఎంప్లాయీస్‌ యూనియన్‌ ప్రధానకార్యదర్శిగా పనిచేశారు. పార్టీకి కొంతకాలం రాష్ట్ర, జాతీయ ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ సభ్యుడిగా, క్రమశిక్షణ కమిటీ సభ్యుడిగా కూడా ఉన్నారు. వివిధ అంశాలపై ఆయన 30పైన పుస్తకాలు రాశారు. ఆయన భార్య 1993లో మృతిచెందగా, ఏకైక కుమార్తె ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. ఈనెల 11వ తేదీన ఆయన అంత్యక్రియలు జరుపుతామని కుటుంబసభ్యులు తెలిపారు.
 

Advertisement
Advertisement