'పది కూడా పాసవ్వని వారు మాకొద్దు' | Sakshi
Sakshi News home page

'పది కూడా పాసవ్వని వారు మాకొద్దు'

Published Tue, Oct 25 2016 4:26 PM

Voters want young, educated candidates in Maharashtra: Survey

న్యూఢిల్లీ: మహారాష్ట్ర ప్రజానీకం తమకు నాయకులుగా విద్యావంతులను, యువకులను కోరుకుంటున్నట్లు ఓ సర్వే వెల్లడించింది. త్వరలో జరగబోయే స్థానిక ఎన్నికల్లో 40 ఏళ్లలోపు విద్యావంతులైన యువకులే తమకు నాయకులుగా రావాలని 84శాతం మంది ఓటర్లు కోరుకుంటున్నారని ఆ సర్వే పేర్కొంది. గోఖలే ఇనిస్టిట్యూట్ ఆఫ్ పాలిటిక్స్ అండ్ ఎకనామిక్స్-పుణె సంస్థ స్థానిక ఎన్నికల నేపథ్యంలో ఈ సర్వే నిర్వహించింది.

92శాతం మంది ఓటర్లు డిగ్రీ పట్టాలున్నవారే తమకు నాయకులుగా రావాలని కోరుకుంటున్నారని కూడా ఆ సర్వే తెలిపింది. స్థానిక ఎన్నికల్లో కనీసం మెట్రిక్యూలేషన్ ఉత్తీర్ణత సాధించినవారు కూడా ఉండటం లేదని 78శాతం మంది ఓటర్లు తీవ్ర అసంతృప్తిని వెలిబుచ్చారు. ఈ ఎన్నికల్లో పోటీ చేసేవారు అవినీతిపరులే ఉంటారని 80శాతంమంది ఓటర్లు నమ్ముతుండగా ధనవంతులై ఉండి ఎన్నికల్లో పోటీ చేసేవారు ఆ ఎన్నికలను కొంటారని 85శాతంమంది ఓటర్లు నమ్ముతున్నారు. నవంబర్ 27, 2016 నుంచి జనవరి 8, 2017 వరకు మొత్తం 33 జిల్లాల్లో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి.

Advertisement
Advertisement