బాటిల్‌ క్రష్‌ చేస్తే ఫోన్‌ రీచార్జ్‌ | Sakshi
Sakshi News home page

బాటిల్‌ క్రష్‌ చేస్తే ఫోన్‌ రీచార్జ్‌

Published Wed, Sep 11 2019 4:57 AM

Want a free mobile recharge Crush your plastic bottles at railway stations - Sakshi

న్యూఢిల్లీ: సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ వాడకాన్ని మానేయాలన్న ప్రధాని నరేంద్రమోదీ స్ఫూర్తితో భారత రైల్వే సరికొత్త ఆవిష్కరణకు శ్రీకారం చుట్టింది. సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ వాడకాన్ని తగ్గించడంలో ప్రయాణీకులను చైతన్యపరిచేదిశగా అడుగులు వేస్తోంది. రైల్వేస్టేషన్లలో ఏర్పాటు చేసిన ప్లాస్టిక్‌ బాటిల్‌ క్రషింగ్‌ మిషన్ల ద్వారా ప్రయాణీకుల ఫోన్లను ఉచితంగా రీచార్జ్‌ చేసే సౌకర్యాన్ని కల్పిస్తోంది. దేశంలోని వివిధ రైల్వే స్టేషన్లలో 400 ప్లాస్టిక్‌ బాటిల్‌ క్రషింగ్‌ మిషన్లను ఏర్పాటుచేస్తున్నట్టు రైల్వే బోర్డు ఛైర్మన్‌ వీకే.యాదవ్‌ వెల్లడించారు.

బాటిల్‌ క్రషింగ్‌ మిషన్లను వినియోగించుకునే ప్రయాణికుల ఫోన్‌ నంబర్‌లో ఉన్న కీ ద్వారా వారి ఫోన్‌ రీచార్జ్‌ అవుతుందనీ ఆయన తెలిపారు. అయితే రీచార్జ్‌కి సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. దేశంలో 128 స్టేషన్లలో 160 బాటిల్‌ క్రషింగ్‌ మెషిన్లు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. ఇప్పటికే రైల్వే స్టేషన్లలోని వాడివేసిన అన్ని ప్లాస్టిక్‌ బాటిల్స్‌ని సేకరించి, వాటిని రీసైక్లింగ్‌కి పంపాల్సిందిగా రైల్వే సిబ్బందికి సూచించామని యాదవ్‌ తెలిపారు. ఇదే నేపథ్యంలో ప్లాస్టిక్‌ వినియోగాన్ని తగ్గించేందుకు అక్టోబర్‌ 2న ప్రతిజ్ఞ కూడా చేయబోతున్నారు.  

Advertisement
Advertisement