సాయంత్రం పెళ్లి.. ఉదయాన్నే విడాకులు! | Sakshi
Sakshi News home page

సాయంత్రం పెళ్లి.. ఉదయాన్నే విడాకులు!

Published Wed, May 18 2016 9:39 AM

సాయంత్రం పెళ్లి.. ఉదయాన్నే విడాకులు!

బిజ్నోర్: పెళ్లికూతురు తరఫు వాళ్లు తీసుకొచ్చిన రూ.1.45 లక్షల నగదు, విలువైన ఆభరణాలు పెళ్లిలో పోవడంతో సాయంత్రం పెళ్లి చేసుకుని, మర్నాటి ఉదయం విడాకులు తీసుకున్న ఘటన జిల్లాలోని కారోండు పచ్చూ గ్రామంలో చోటుచేసుకుంది. వరుడి తరఫు వ్యక్తే డబ్బు, ఆభరణాలు దొంగిలించారని పెళ్లికూతురి తరఫు వాళ్లు ఆరోపించడంతో కోపోద్రిక్తుడైన వరుడు వధువుకు విడాకులు ఇచ్చాడు.

కారోండు పచ్చూ గ్రామానికి చెందిన ఇమ్రాన్ ఖాన్‌కు పొరుగు గ్రామంలోని నసీర్ అహ్మద్ కూతురితో వివాహం నిశ్చయమైంది. పెళ్లి కోసం మండపం వద్దకు తీసుకొచ్చిన రూ.1.45 లక్షల నగదు, విలువైన ఆభరణాలు పోవడంతో నసీర్ అహ్మద్.. వరుడి బంధువులే ఈ దొంగతనం చేశారని ఆరోపించారు. వరుడిని, అతని తండ్రిని రాత్రంతా నిర్బంధించారు. విషయం తెలుసుకున్న పోలీసులు జోక్యం చేసుకుని ఇరువురిని విడిపించారు. ఈ అవమానాంతో కోపగించిన వరుడు వధువుకు విడాకులు ఇచ్చాడు. ఇంటికి చేరుకున్న రెండు కుటుంబాల మధ్య తీవ్ర వాగ్వాదం తలెత్తింది. వరుడి మేనల్లుడు, వేరే మహిళ ఇద్దరూ కలిసి దొంగతనం చేశారని నసీర్ అహ్మద్ ఆరోపించడంతో వధువు తరఫు వాళ్లే వరుడి బంధువులతో తప్పుగా ప్రవర్తించారని అన్నారు.

గ్రామస్తుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు ఇరు కుటుంబాలను స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారు. ఎస్సై శివకుమార్ మాట్లాడుతూ.. ఇప్పటివరకు రెండు కుటుంబాల్లో ఏ ఒక్కరూ కూడా ఫిర్యాదు చేయలేదని తెలిపారు. రాజీ కోసం ప్రయత్నిస్తున్నట్లు గ్రామ పెద్దలు తెలిపారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement