మిస్సింగ్‌కు ముందు ఏమైంది? | Sakshi
Sakshi News home page

మిస్సింగ్‌కు ముందు ఏమైంది?

Published Mon, Jan 4 2016 2:43 AM

మిస్సింగ్‌కు ముందు ఏమైంది?

లండన్: విమాన ప్రమాదంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ మిస్సింగ్‌కు ముందు రోజుల్లో ఏం జరిగిందనే వివరాలను ఆయన మనవడు, జర్నలిస్ట్ ఆశిష్ రే బహిర్గతం చేస్తున్నారు. లండన్ నుంచి నిర్వహించే వెబ్‌సైట్ ‘బోస్‌ఫైల్స్‌డాట్‌ఇన్ఫో’లో  వీటిని  డాక్యుమెంట్ల సహితంగా పొందుపరుస్తున్నారు. 1945 ఆగస్టు 18న తైవాన్‌లో నేతాజీ ప్రయాణిస్తున్న విమానం ప్రమాదానికి గురైన ముందురోజు ఆయన ఎక్కడి నుంచి ఎక్కడి వెళ్లింది వీటిలో ఉన్నాయి. డాక్యుమెంట్ల ప్రకారం.. నేతాజీ ఆగస్టు 17న బ్యాంకాక్ నుంచి బయలుదేరి మధ్యాహ్ననికి సైగన్ చేరుకున్నారు. జపాన్‌కు చెందిన ఆ విమానంలో ఎక్కువ మందికి చోటులేదని, కల్నల్ రెహ్మన్, నేతాజీ మాత్రమేఅందులో  ప్రయాణించారని ఆ దేశ సాక్షులు చెబుతున్నారు. విమానం సైగన్ నుంచి హైటో, తైపీ, డెరైన్ మీదుగా టోక్యో చేరాల్సి ఉంది.

జపాన్ ఆర్మీలోని రష్యా వ్యవహారాల నిష్ణాతుడు జనరల్ షీడీ కూడా ఆ విమానంలో ఉన్నారు. అప్పటి సోవియట్ సరిహద్దులోని చైనా ప్రాంతం మంచూరియాకు వెళుతున్నారు. ఆయనతో పాటు నేతాజీ కూడా వెళ్లాలని నిర్ణయించారని బోస్‌కు జపనీస్ దుబాసీ నెగిషీ.. విచారణ కమిటీకి తెలిపారు. దీన్ని బట్టి మంచూరియాలోని డెరైన్‌కు వెళ్లడానికి నేతాజీ అంగీకరించి ఉంటారని తెలుస్తోంది. అయితే సైగన్‌లో బయలుదేరడం ఆలస్యం కావడంతో అనుకున్న ప్రకారం కాకుండా మధ్యలో విమానం ఆగినట్లు వెబ్‌సైట్ డాక్యుమెంట్ల ద్వారా తెలుస్తోంది.

Advertisement
Advertisement