అంకుల్ అనడానికి నువ్వు ఎవరు? | Sakshi
Sakshi News home page

అంకుల్ అనడానికి నువ్వు ఎవరు?

Published Tue, Apr 7 2015 9:18 AM

అంకుల్ అనడానికి నువ్వు ఎవరు? - Sakshi

న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియా విమానం పైలట్లు ఘర్షణ పడిన ఘటన జైపూర్ లో ఆదివారం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. జైపూర్ నుంచి ఢిల్లీకి విమానం బయలుదేరడానికి ముందు కాక్ పిట్ లో కెప్టెన్, కో- పైలట్ ఘర్షణ పడిన ఘటన తారా స్థాయికి చేరింది. అసలు ఈ గొడవ జరగడానికి కారణం మాత్రం కెప్టెన్ తన కో పైలట్ ను అంకుల్ అని పిలవడేమనట. విమానం టేక్ ఆఫ్ కు ముందు కెప్టెన్ అంకుల్ అని పిలవడంతో గొడవకు దారి తీసింది.

 

సీనియర్ పైలట్ అయిన కెప్టెన్ యువకుడు కావడంతో కో-పైలట్ ను అంకుల్ అని ఉచ్చరించాడు. దీంతో కో పైలట్ విభేదించి కెప్టెన్ తో ఘర్షణకు దిగాడు. తనను అంకుల్ అనడానికి నువ్వు ఎవరు? అని కో పైలట్ ప్రశ్నించాడు. అంతటితో ఆగకుండా కెప్టెన్ ను అసభ్య పదజాలంతో దూషించి అతడిపై కో-పైలట్ దాడి చేశాడని ఎయిర్ లైన్స్ వర్గాలు స్పష్టం చేశాయి. దీనిపై తమకు ఫిర్యాదు అందిందని త్వరలోనే ఈ ఘటనపై విచారణ జరిపిన అనంతరం తగిన చర్యలు తీసుకుంటామని అధికారి ప్రతినిధి ఒకరు స్పష్టం చేశారు.

Advertisement
Advertisement