ప్రతిపక్షనేత క్షమాపణ చెప్పాలి: సీఎం | Sakshi
Sakshi News home page

ప్రతిపక్షనేత క్షమాపణ చెప్పాలి: సీఎం

Published Mon, Apr 25 2016 10:39 AM

ప్రతిపక్షనేత క్షమాపణ చెప్పాలి: సీఎం

కొచ్చిన్: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో కేరళ రాజకీయాలు వేడెక్కాయి. కేరళ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ కి చెందిన సీనియర్ నాయకుడు ఉమెన్ చాందీ, ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి వీఎస్ అచ్యుతానందన్ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.

తన పై ప్రతిపక్షనేత దుష్ప్రాచారం చేస్తున్నారని ఉమెన్ చాందీ మండిపడ్డారు. కోర్టులో ఉమెన్ చాందీపై 31 కేసులు పెండింగ్లో ఉన్నాయని అచ్యుతానందన్ ఆరోపించారు. అయితే దీని పై చాందీ స్పందిస్తూ..'కోర్టులో నాపై ఉన్న కేసుల వివరాలు బహిర్గతం చేయాలి. నాపై ఒక్క కేసు కూడా పెండింగ్లో లేదు. దీనిపై అచ్యుతానందన్ వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకొని  బేషరతుగా క్షమాపణచేప్పాలి' అన్నారు. లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

ఎవరైనా కోర్టులో, పోలీసు స్టేషన్లోగానీ ఫిర్యాదు నమోదు చేసినంత మాత్రాన దాన్ని కేసుగా పరిగణించలేమన్నారు. కేసు ఎఫ్ఐఆర్ తో ప్రారంభమౌతుంది. తనపై నమోదైన ఏ కేసులోనైనా ఎఫ్ఐఆర్ కాపీని చూపించాలని అచ్యుతానందన్కు సవాలు విసిరారు. తన మంత్రివర్గసభ్యులపైన కూడా 131 కేసులు నమోదయ్యాయన్న వ్యాఖ్యల్లో వాస్తవంలేదన్నారు. కేవలం ఆర్థికమంత్రి కేఎం మణి పై ఒక్క కేసు మాత్రమే నమోదైందన్నారు. దీనిపై విజిలెన్స్ డిపార్ట్ మెంట్ దర్యాప్తు చేసి కేసుకు సంబందించి పూర్తి వివరాలను కోర్టు సమర్పించిందని తెలిపారు.

Advertisement
Advertisement