అతడి చేతిలో తుపాకి ఉంది.. ఐతే ఏంటి? | Sakshi
Sakshi News home page

అతడి చేతిలో తుపాకి ఉంది.. ఐతే ఏంటి?

Published Wed, Jun 5 2019 6:19 PM

Woman Fights With Gun Wield Thief In Lucknow - Sakshi

లక్నో : తుపాకితో బెదిరించి దోచుకోవాలనుకున్న ఓ దొంగకు మతి పోయేలా చేసిందో మహిళ. తుపాకికి ఏ మాత్రం అదరకుండా.. బెదరకుండా అతడ్ని తరిమికొట్టింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. లక్నోకు చెందిన ఓ మహిళ తన ఇంటిముందు నిలబడి ఉంది. ఇంతలో ఇద్దరు ముసుగు దొంగలు బైక్‌పై అక్కడకు చేరుకున్నారు. ఒక దొంగ బైక్‌పైనుంచి కిందకు దిగి ఆ మహిళను సమీపించాడు. మరో దొంగ అతడికోసం దూరంగా బైక్‌పై వేచిచూస్తున్నాడు. మహిళను సమీపించిన దొంగ తుపాకి బయటకు తీసి ఆమెను భయపెట్టాడు. ఒంటిమీది నగలు తీసివ్వకపోతే చంపుతానని బెదిరించాడు. ఇలాంటి సమయంలో మామూలు మనుషులైతే బిక్కచచ్చిపోయేవాళ్లే. కానీ ఆ మహిళ ఏ మాత్రం భయపడకుండా అతడిపై దాడికి దిగింది. ఈ ఊహించని పరిణామంతో అతడు బిత్తరపోయాడు. చేసేదేమీ లేక కాళ్లకు బుద్ధిచెప్పాడు.

Advertisement
Advertisement