బీజేపీలోకి యడ్యూరప్ప పునరాగమనం!

11 Jul, 2013 15:21 IST|Sakshi
బీజేపీలోకి యడ్యూరప్ప పునరాగమనం!

బీజేపీలో మళ్లీ చేరడానికి సుముఖంగా ఉన్నట్టు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కేజేపీ అధ్యక్షుడు యడ్యూరప్ప తెలిపారు. ఈ విషయంలో బీజేపీ జాతీయ నాయకులు తనతో సంప్రదింపులు జరుపుతున్నారని ఆయన వెల్లడించారు.

సొంత గూటికి తిరిగొచ్చే విషయంపై తగిన సమయంలో నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. పునరాగమనంపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ ఇతర సీనియర్ నాయకుల నుంచి తనకు వర్తమానాలు వచ్చాయని పేర్కొన్నారు. తన మద్దతుదారులతో చర్చించిన తర్వాత దీనిపై నిర్ణయం తీసుకుంటానన్నారు.

బీజేపీ నేతలే ముందుగా మీతో సంప్రదింపులు జరిపారా అని అడగ్గా.. ఈ పశ్నే ఉత్పన్నం కాదని అన్నారు. ఇటీవల జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కేజేపీ 10 శాతం ఓట్లు సాధించి బీజేపీకి భారీ నష్టం కలిగించడంతో మధ్యలో కాంగ్రెస్ పార్టీ లాభపడింది. కాంగ్రెస్ లో చేరే ప్రసక్తే లేదని యడ్యూరప్ప స్పష్టం చేశారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు