80 శాతం నీటి వృధా అరికట్టేందుకు.. | Sakshi
Sakshi News home page

80 శాతం నీటి వృధా అరికట్టేందుకు..

Published Thu, Aug 25 2016 10:55 AM

You Can Reduce Water Wastage by Upto 80% by Using These Taps

నీటి ఎద్దడిని నివారించేందుకు ప్రభుత్వం పలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తుండగా... కొన్ని పంచాయితీలు, పట్టణాలు, నగరాల పరిథుల్లో నీటి వృధాను మాత్రం అరికట్టే పరిస్థితులు కనిపించవు. రక్షిత మంచినీటి పథకంద్వారా ఏర్పాటు చేసిన మంచినీటి కుళాయిలనుంచీ భారీగా నీరు రోడ్లపై ప్రవహిస్తున్నా పట్టించుకునే నాధుడే ఉండడు. ప్రభుత్వం అందించే మంచినీటి సరఫరాలో చాలాచోట్ల పైపులకు కుళాయిలు బిగించకుండా వదిలేయడంతో ఆయాప్రాంతాల్లో  నీరంతా కుళాయిలనుంచి వృధాగా పోతుండటం పరిపాటిగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో నీటి వృధాను 80 శాతం వరకూ అరికట్టేందుకు ప్రత్యేక కుళాయిలను అందుబాటులోకి తెచ్చింది ఓ భారత సంస్థ.

నీటిని పొదుపుగా వాడాలంటూ ప్రభుత్వం ఎన్ని హెచ్చరికలు జారీ చేస్తున్నా అమలు విషయంలో ప్రజల నిర్లక్ష్యం కనిపిస్తూనే ఉంటుంది. అందుకే ఓ భారతీయ కంపెనీ ఎకో 365 పేరిట కొతరకం కుళాయిలను అభివృద్ధి పరచింది. ఇవి మామూలు కుళాలకు భిన్నంగా  నీటి వృధాను అరికట్టే విధంగా ఉంటాయని సదరు సంస్థ చెప్తోంది. సాధారణ కుళాయిలు నిమిషానికి 10 నుంచి 12 లీటర్ల నీటిని అందిస్తాయి. అయితే ఇవి నిజానికి తీవ్ర నీటి వృధాకు దారి తీస్తాయని,   ఎకో 365 కుళాయిలను నీటి వృధాను అరికట్టే కొత్త విధానంలో రూపొందించడంతో సుమారు 80 శాతం నీరు వేస్ట్ కాకుండా కాపాడవచ్చని రూపకర్తలు చెప్తున్నారు. కుళాయిలనుంచి వచ్చే నీటి ప్రవాహాన్ని ముందుగానే గుర్తించేట్లుగా సమర్థవంతంగా వీటిని రూపొందించామని కంపెనీ చెప్తోంది. ఈ కొత్తరకం ట్యాప్ లు మీ అవసరాన్ని బట్టి మాత్రమే నీటిని అందించడంతో చాలాశాతం వృధా తగ్గే అవకాశం ఉంది. నీటి ఎద్దడి ఎదుర్కొంటున్న సమయంలో నీటిని ఆదా చేయడం ఎంతో అవసరం అన్నకోణంలో ఆలోచించిన కంపెనీ ఈ కొత్తరకం ఎకో 365 కుళాయిలను రూపొందించినట్లు చెప్తోంది. ముఖ్యంగా ఈ వాటర్ సేవర్ ట్యాప్ లను అపార్ట్ మెంట్లు, కార్యాలయాలు, గృహాల్లో ఏర్పాటు చేసుకుంటే ఎంతో ఉపయోగంగా ఉంటుందని కంపెనీ చెప్తోంది.

Advertisement
Advertisement