మావోలకు వెరవని గిరిజన యువతి

16 Jul, 2019 22:13 IST|Sakshi

రాయ్‌పూర్‌ : మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సదుపాయాలు అంతంతమాత్రంగానే ఉంటాయి. పైగా అక్కడి ప్రభుత్వానికి కూడా అధికారాలు తక్కువ. మావోల ప్రభావం కలిగిన ఛత్తీస్‌గఢ్‌లోని అబూజాబాద్‌ ప్రాంతంలో కీర్టా డోప్రా అనే గిరిజన యువతి మెడికల్‌ స్టోర్‌ను ప్రారంభించింది. ఈ ప్రాంతంలో ఎక్కువగా గిరిజనులు ఉంటారు. వీరికి ప్రాథమిక సదుపాయాలు, రోడ్డు మార్గాలు లేవు. రోజు మొత్తమ్మీద నాలుగు బస్సులు మాత్రమే ఇక్కడికి వస్తాయి. ప్రతి బుధవారం ఇక్కడ కూరగాయల సంత జరుగుతుంది.

మావోయిస్టుల తిరుగుబాటు నేపథ్యంలో జన్‌ ఔషధీ కేంద్రం మాత్రమే ఔషధాలను అందజేస్తోంది. ఇక్కడ ఈ వెసులుబాటు లేకపోతే ఔషధాలకోసం 70 కిలో మీటర్లు వెళ్లక తప్పదు. ఆర్ధిక పరిస్థితుల కారణంగా మరియా తెగకు చెందిన కీర్టా చదువు ఇంటర్‌తోనే ఆగిపోయింది. ఒక రోజు ఈ గ్రామంలో యూనిసెఫ్‌ సంస్థ పోషకాహారలోపంపై కార్యక్రమం నిర్వహించగా కీర్టా అందులో పాల్గొని అందరికీ అవగాహన కల్పించింది. ఆ సమయంలోనే ఈ ప్రాంత సమస్యలను యూనిసెఫ్‌ సంస్థ దృష్టికి తీసుకుపోయింది. వారి సహకారంతో మలేరియా, డయేరియాతోపాటు అన్నిరకాల మందులను గ్రామస్థులకు అందుబాటులో ఉంచుతోంది.

అలా ఆమె రోజుకు 12 గంటలు పనిచేసి నెలకు రూ.2,000పైగా సంపాదిస్తోంది. కీర్టా తెగువను గుర్తించిన యూనిసెఫ్‌ సంస్థ 2014లో సాహసి అవార్డుతో సన్మానించింది. ఈ విషయమై జిల్లా వైద్యాధికారి మాట్లాడుతూ‘‘ మావోయిస్టులు ఏ క్షణంలోనైనా ఆ షాపుపై దాడి చేయవచ్చు. ధ్వంసం కూడా చేయొచ్చు. అయితే కీర్టా అవేవీ పట్టించుకోలేదు. ఆమె ధైర్యం అందరికీ ఆదర్శం. ఇటువంటివారి వల్ల సమాజానికి ఎంతో మేలు జరుగుతుంది’’ అని అన్నారు.    

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

బీజేపీలో చేరిన మాజీ ప్రధాని కుమారుడు

‘మరో కార్గిల్‌ వార్‌కు రెఢీ’

‘నా కల నిజమైంది.. మళ్లీ ఆశలు చిగురించాయి’

ఈనాటి ముఖ్యాంశాలు

జయప్రద వర్సెస్‌ డింపుల్!

టిక్‌ టాక్‌: మహిళా పోలీసుల స్టెప్పులు.. వైరల్‌

యువతికి రాంచీ కోర్టు వినూత్న శిక్ష

భారీ వర్ష సూచన.. రెడ్‌అలర్ట్‌ ప్రకటన

విమాన ప్రయాణీకులకు భారీ ఊరట

‘వాళ్లు పుస్తకం ఎలా కొంటారు’

అసెంబ్లీ ఎన్నికలు: కమలానికి కొత్త సారథి

ఫేక్‌న్యూస్‌ : 15వ దలైలామాగా ‘సత్యసాయి’ విద్యార్థి

‘మళ్లీ సోనియాకే పార్టీ పగ్గాలు’

కుప్పకూలిన భవనం : శిథిలాల కింద..

ఐఏఎఫ్‌లో చేరనున్న అమర జవాన్‌ భార్య

కేంద్ర మంత్రులపై మోదీ ఆగ్రహం

ప్రజలకు అది పెద్ద సమస్య.. దృష్టి పెట్టండి : మోదీ

14 మంది ఉగ్రవాదులకు రిమాండ్‌

నటిపై అసభ్యకర కామెంట్లు.. వ్యక్తి అరెస్ట్‌

కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రోషన్‌ బేగ్‌ అరెస్ట్‌

డ్రైవింగ్‌ లైసెన్స్‌కు ‘ఆధార్‌’ ఆపేశాం

‘ఆయనేం దేవుడు కాదు; రూల్స్‌ చదువుకుంటే మంచిది’

ఐదేళ్ల చిన్నారిపై కీచకపర్వం

పెళ్లి వేడుకకూ పరిమితులు

‘హిమాచల్‌’ మృతులు14

గవర్నర్‌ కీలుబొమ్మా?

‘కోట్ల’ కర్నాటకం

ఇంజనీరింగ్‌లో ఆ కోర్సులకు సెలవు

రోడ్డు ప్రమాదంలో మరణిస్తే 5 లక్షలు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘బిగ్‌ బాస్‌’పై మరో వివాదం

టాక్‌ బాగున్నా.. కలెక్షన్లు వీక్‌!

 ఆ హీరోయిన్‌కు సైబర్‌ షాక్‌

మూడు నెలల అనంతరం రిజెక్ట్‌ చేశారు..

కంగనా రనౌత్‌కు ‘మెంటలా’!

డ‌బ్బింగ్ కార్యక్రమాల్లో ‘మ‌న్మథుడు 2’