అపోహలతో అనారోగ్యం | Sakshi
Sakshi News home page

అపోహలతో అనారోగ్యం

Published Fri, Jun 6 2014 10:32 PM

అపోహలతో అనారోగ్యం - Sakshi

 న్యూట్రీషియన్, రచయిత్రి రుజుతా దివాకర్
 
 న్యూఢిల్లీ: మధుమేహం..రక్తపోటు.. ఊబకాయం.. ఇవి వంశపారంపర్యంగా వచ్చే జబ్బులని ఇప్పటివరకూ అనుకునేవారు..అయితే ఇప్పుడు అవి చాలా సాధారణ జబ్బులుగా మారిపోయాయంటే అతిశయోక్తి కాదు. జీవితాల్లో వేగం, వ్యాయాయం లేకపోవడం, తినే తిండిపై నియంత్రణ లేకపోవడం, సరైన వేళకు నిద్రపోకపోవడం వల్ల ప్రస్తుత స్పీడ్ యుగంలో మధుమేహం, రక్తపోటు, ఊబకాయం వంటి వ్యాధులతో టీనేజర్లు ఇబ్బందులు పడుతున్నారు.
 
 యువత తమ శరీరంపై తగిన నియంత్రణ కోల్పోయిన తర్వాత ఫిట్‌నెస్ సెంటర్లకు పరుగులు తీస్తున్నారని రచయిత్రి రుజుతా దివాకర్ తెలిపారు. ‘నేడు రోడ్లపైనా, సందుల్లోనా ఎక్కడిపడితే అక్కడ జిమ్‌లు, యోగా సెంటర్లు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. అయితే చాలా సెంటర్లలో శిక్షణ కోసం చేరి న వారికి గాయాలు తప్పితే సరైన ఫలితాలు పొందడంలేద’ని దివాకర్ ఆవేదన వ్యక్తం చేశారు. కరీనా కపూర్, ప్రీతి జింతా, అనిల్ అంబానీ వంటి హేమాహేమీలకు న్యూట్రీషియన్, ట్రయినర్‌గా రుజుతా సేవలందిస్తున్నారు. ఇటీవలనే ఆమె రాసిన ‘డోంట్ లాస్ అవుట్, వర్కవుట్’ అనే పుస్తకంలో వ్యాయామంపై పలువురికి ఉన్న అపోహ గురించి చర్చించా రు.
 
 పలు సెంటర్లలో ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండటానికి ఇస్తున్న ఆహార సలహాలు వారిని మరింత నీరసంగా తయారుచేస్తున్నాయని వివరించారు. చాలా మంది యువకులకు తమ శరీరానికి ఎటువంటి వ్యాయామం సరిపోతుందో అవగాహన లేక లేని పోని ఇబ్బందులు కొనితెచ్చుకుంటున్నారని ఆమె తన పుస్తకంలో పేర్కొన్నారు. తమ జిమ్‌కు వచ్చిన వ్యక్తి శరీరతత్వానికి సరిపడా వ్యాయామాన్ని సూ చించడంలో జిమ్‌లో శిక్షకుడు అప్రమత్తుడై ఉండాల ని ఆమె సూచించారు.
 
‘చాలామంది ట్రైనర్లు తమ వద్దకు వచ్చిన యువకులకు కాలరీలను తగ్గించుకోవడానికి నీటిని తక్కువగా తాగాలని సూచిస్తున్నా రు. కాని అది మనిషి జీవక్రియపై ప్రభావముం టుందనే విషయం మరిచిపోతున్నార..’ని ఆమె పే ర్కొన్నారు.‘ఒక పురుషుడి శరీరంలో నీరు 55-60 శాతం ఉండాలి.. అయితే కొందరు శిక్షకులు తమ వద్దకు వచ్చిన క్లైయింట్ బరువు తగ్గించేందుకు తా త్కాలిక పద్ధతులను వినియోగిస్తున్నారు. ఇందులో భాగంగా శరీరంలో నీటిశాతం తగ్గించేలా వారితో వ్యాయామం చేయిస్తున్నారు..దీంతో భవిష్యత్తులో వారు పలు అనారోగ్యాలకు కారణమయ్యే అవకాశముంది..’ అని ఆమె తెలిపారు.
 
వ్యాయామ కళపై అందరికీ అవగాహన పెరిగేలా కృషిచేయాల్సిన అవసరం ఉందని ఆమె స్పష్టం చేశారు. ‘సాధారణంగా ఎక్కువ చెమట పడితే శరీరంలో ఎక్కువ కాలరీలు ఖర్చు అవుతాయనేది కూడా ఒక అపోహే. చెమటపట్టడం అనేది శరీరాన్ని చల్లబరిచే ప్రక్రియ.దాని వల్ల కాలరీలు ఖర్చు కావు..’ అని ఆమె వివరించారు. న డక మంచి వ్యాయామం పరుగు వలన మోకాళ్లు అరిగిపోతాయి.. కార్డియో వ్యాయామం వల్ల కాళ్లు, కీళ్లు బలపడతాయి.. పొట్ట తగ్గడానికి దానిపై ఒత్తిడి పెంచాలి..వంటికి కూడా మనలను వెంటాడుతున్న అపోహలేనని ఆమె తన పుస్తకంలో పొందుపరిచారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement