'2026 వరకు ఏపీ అసెంబ్లీ సీట్లను పెంచరు' | Sakshi
Sakshi News home page

'2026 వరకు ఏపీ అసెంబ్లీ సీట్లను పెంచరు'

Published Mon, Feb 8 2016 12:26 PM

'2026 వరకు ఏపీ అసెంబ్లీ సీట్లను పెంచరు' - Sakshi

న్యూఢిల్లీ: 2026 వరకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సీట్లు పెంచే అవకాశం లేదని కేంద్ర ఎన్నికల సంఘం చెప్పిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నేత మేకపాటి రాజమోహన్ రెడ్డి వెల్లడించారు. సోమవారం ఎన్నికల సంఘం అధికారులతో సమావేశమైన అనంతరం మేకపాటి మీడియాతో మాట్లాడారు.

'ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం అసెంబ్లీ సీట్లు పెరుగుతాయని ప్రజలు భావిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా సీట్లు పెరుగుతాయని పదేపదే చెబుతున్నారు. మరో 50 మందిని అకామిడేట్ చేస్తామని చంద్రబాబు చెప్పుకొంటున్నారు. చంద్రబాబు మాటల్లో నిజమెంతో తెలుసుకోవడానికి ప్రయత్నించాం. స్పష్టత కోసం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిశాం. 2026 వరకు ఏపీ అసెంబ్లీ సీట్లు పెంచడం సాధ్యం కాదని ఈసీ అధికారులు చెప్పారు. ఈ విషయంపై అటార్నీ జనరల్ అభిప్రాయాన్ని తెలుసుకున్నారు. ఏజీ కూడా ఇదే విషయం చెప్పారు. అయితే చంద్రబాబు ఎందుకు ఇలా చెబుతున్నారో అర్థంకావడం లేదు. చంద్రబాబు రాజకీయ  ఎత్తుగడలకు దిగుతున్నారు' అని మేకపాటి రాజమోహన్ రెడ్డి చెప్పారు.

Advertisement
Advertisement