అమెరికాలో సిలికానాంధ్ర విశ్వవిద్యాలయ ప్రథమ స్నాతకోత్సవం

31 Jan, 2019 13:56 IST|Sakshi

కాలిఫోర్నియా: ఆమెరికాలోని కాలిఫొర్నియాలో భారతీయ కళలు, భాషలలో మాస్టర్స్, డిప్లొమ మరియు సర్టిఫికెట్ స్థాయి కోర్సులను అందిస్తున్న సిలికానాంధ్ర విశ్వవిద్యాలయ ప్రథమ స్నాతకోత్సవం కాంప్ బెల్ హెరిటేజ్ థియేటర్‌లో ఘనంగా జరిగింది. తొలి బ్యాచ్ లో చేరి కోర్సు పూర్తి చేసిన ౩1 మంది విద్యార్ధులకు సిలికానాంధ్ర విశ్వ విద్యాలయ అధ్యక్షులు ఆనంద్ కూచిభొట్ల, విశ్వ విద్యాలయ పాలకవర్గ  చైర్మన్ లకిరెడ్డి హనిమిరెడ్డి చేతుల మీదుగా పట్టాలు అందించారు.
 
విశ్వవిద్యాలయం ప్రొవొస్ట్ రాజు చమర్తి ముందు నడవగా ఆనంద్ కూచిభొట్ల, డా. హనిమిరెడ్డి లక్కిరెడ్డి, డా. పప్పు వేణుగోపాల రావు, నీరజ్ భాటియా,  చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్ దీనబాబు కొండుభట్ల, చీఫ్ కాంప్లయన్స్ ఆఫీసర్  దిలీప్ కొండిపర్తి, ప్రముఖ వ్యక్తిత్వవికాస నిపుణులు  ప్రసాద్ కైపా మరియు పట్టభద్రులు కాబోతున్న విద్యార్ధులు స్నాతకోత్సవ దుస్తులతో కవాతుగా వేదిక వద్దకు వచ్చారు.  

ఈ స్నాతకోత్సవ సంబరాల్లో విశ్వవిద్యాలయ విద్యార్ధులు అబ్బురపరిచే ప్రదర్శనలిచ్చారు.  ప్రఖ్యాత సంగీత విద్వాంసులు, సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం కర్ణాటక సంగీత ఆచార్యులు డా. శ్రీరాం పరశురాం నిర్వహించిన హిందుస్తాని-కర్ణాటక సంగీత జుగల్‌బంది కచేరీకి  ప్రేక్షకులు తన్మయత్వం చెందారు. ఈ కార్యక్రమంలో పాల్గొనటానికి భారతదేశం నుంచి ప్రత్యేకంగా విచ్చేసిన అధ్యాపక బృందం డా. శ్రీరాం పరశురాం, డా.మాలా స్వామి, డా.రమాదేవి, డా. సుమిత్ర వేలూరి, డా.యశోద ఠాకూర్, డా.అనుపమ కైలాష్ తదితరులను విశ్వవిద్యాలయ పాలకవర్గం ప్రత్యేకంగా సన్మానించింది.    
 

మరిన్ని వార్తలు