రా! లేచిరా! గోదారి పిలుస్తోంది రా! | Sakshi
Sakshi News home page

రా! లేచిరా! గోదారి పిలుస్తోంది రా!

Published Sat, Jun 6 2015 12:02 PM

రా! లేచిరా! గోదారి పిలుస్తోంది రా!

( అక్షర తూణీరం)
 పుష్కరాలు ఎప్పుడైనా ఒక గొప్ప యీవెంటే. ఎప్పుడో ఎనభై ఏళ్లనాడు వచ్చిన గ్రామఫోన్ రికార్డు, అందులో ‘‘దొడ్డమ్మా పుష్కరాల వింతలూ’’ అనే పాట చాలా మందికి జ్ఞాపకం. పుష్కరాల తీర్థంలో ఎలాంటి మోసాలు జరుగుతాయో, ఎంత జాగ్రత్తగా ఉండాలో చెబుతుందా పాట.
 
 మీకు తెలుసా?
 మన దేశంలో జీవనదులకు ప న్నెండేళ్లకోసారి పుష్కరం వస్తుంది. ఇ ట్లా క్రమం తప్ప కుండా పుష్కరుడు నదులలో ప్రవేశిం చడం కొన్ని వేల సంవత్సరాల నుంచి జరుగు తూనే ఉంది. కావాలంటే మన పాత పంచాం గాలు తిరగేసుకోండి. గంగానదికి పుష్కరం వస్తే అది కుంభమేళా.  మనకి ఎప్పుడో పుష్కర సందడి మొదలైపోయింది. ఇది కూడా రాజకీయ సిలబస్‌లో ఒక అధ్యాయంగా తయారైంది. ఇన్ని కోట్లు, అన్ని కోట్ల నిధులు పుష్కరాలకి విడు దల చేస్తున్నామని ప్రకటనలు మొదలై చాలా నిలువెత్తు బొమ్మలతో హోర్డింగ్స్ రూపుదిద్దు కుంటున్నాయి. ’’ముణగండి! ముణగండి!’’ అంటూ తాటికాయంత అక్షరాలతో నినాదం వుంటుంది. పుష్కర స్నానానికి వచ్చేవారు యివి చూసి, ‘‘ఎప్పుడో మునిగాం మళ్లీనా’’ అనుకుంటారు మనసులో.

ప్రతి సందర్భాన్ని రాజకీయ లబ్ధికి వాడుకోవడం నేటి టెక్నాలజీ అయితే కావచ్చుగాని అది అన్యాయం. పుష్క రం కేవలం హిందూ మతానికి సంబంధిం చిన అంశం. కర్మకాండల మీద, క్రతువుల మీద నమ్మకం, విశ్వాసం వున్న వారు తమ పెద్దలను స్మరించుకునే సదవకాశం. దేవత లకు అర్ఘ్యం యివ్వడం, పెద్దలకు పేరు పేరు నా పిండప్రదానం చేయడం పుష్కర విధిలో ముఖ్యాంశం. పుష్కరాంశలో నది మహా పవి త్రంగా ఉంటుంది కాబట్టి పుణ్యస్నానాలు ఆచరిస్తారు. దాన ధర్మాలు అప్పుడే కాదు ఎప్పుడు చేసినా పుణ్యమే. అయినా అదొక మంచి సందర్భం.


పుష్కరాలు ఎప్పుడైనా ఒక గొప్ప యీవెంటే. ఎప్పుడో ఎనభై ఏళ్లనాడు వచ్చిన గ్రామఫోన్ రికార్డు, అందులో ‘‘దొడ్డమ్మా పుష్కరాల వింతలూ’’ అనే పాట చాలా మందికి జ్ఞాపకం. పుష్కరాల తీర్థంలో ఎలాంటి మోసాలు జరుగుతాయో, ఎంత జాగ్రత్తగా ఉండాలో చెబుతుందా పాట. అప్పుడు కూడా ఏటి ఒడ్డున, గోదారి గట్టున బోలెడు వ్యాపారం నడిచేది. క్రమేపీ ఆ పని స్వయంగా ప్రభుత్వాలే చేపట్టాయి. సీసాల్లో గోదావరి నీళ్లని పోస్టాఫీసుల్లో అమ్ముతారట! గంగ తీర్థంతో కాశీ నుంచి చిన్నచిన్న రాగి చెంబులో సీలు వేసిన మూతలలో తెచ్చుకుంటారు.

ఆ చిన్న కాశీచెంబు యాత్రకి జ్ఞాపకంగా మిగిలేది. ఇంతకు ముందు రంజాన్ దీక్షల వేళ హలీం అమ్మించారు. దాన్ని మధ్యలో ఆపేశారు. భద్రాచలం సీతారామకళ్యాణం అక్షింతలు, ప్రసాదాలు పోస్టాఫీసుల్లో అమ్మించారు. ఈ క్రమంలో తిరపతి లడ్డు లాభదాయకం. అసలు ఆ ఆదాయం మీదే బతుకుతున్న సర్కార్లకి పోస్టాఫీసుల్లో లిక్కరు అమ్మించాలనే ఆలోచన ఎందుకు రాలేదో?!


 కోట్లాది రూపాయలు పుష్కర పనులకి ప్రభుత్వాలు కేటాయించడం మంచిదే. చెరువుల నిర్మాణం, సత్రవులు పెట్టడం లాగే నదులకు స్నానఘట్టాలు నిర్మించడం పుణ్యకార్యం గా భావించేవారు. స్తోమతు గల ధార్మికులు ఆ పని చేశారు. ప్రభుత్వం యిప్పుడు వందల కోట్లు విడుదల చేస్తున్నట్టు వూరిస్తోంది.

పుష్కర పర్వం ఆరంభం కావడానికి వారం ముందు డబ్బులు బయటకు వస్తాయి. పుష్క రాలు ఎప్పుడు వస్తాయో సర్కార్ల వారికి పన్నెండేళ్ల ముందే తెలుసు. కాని హడావిడిగా గోదావరికి వరద వచ్చిన సందర్భంలో లాగా దీనికి చేస్తారు. అక్కడక్కడి పంచాయతీలకు, మునిసిపాలిటీలకు అప్పగిస్తే వారే చేయించు కుంటారు. పుష్కరాలు కూడా క్యాంపెయిన్‌కి వేదికలు, భోక్తలకు విందు భోజనం. పుష్క రాల సొమ్ముని కైంకర్యం చేస్తే, దప్పికతో మరణిస్తారని పురాణాలు ఘోషిస్తున్నాయి. తర్వాత వారిష్టం.
 

(రచయిత: శ్రీరమణ, వ్యాసకర్త ప్రముఖ కథకుడు)
 

Advertisement
Advertisement